భార్యంటే భయమంటున్న బాలీవుడ్ స్టార్..
తన భార్యంటే తనకు చాలా భయమని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒక టీవిషో లో తన మనసులో మాటను బయటపెట్టారు. కౌన్ బనేగా కరోడ్ పతి షోను అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ షో కూడా ప్రజల్లో ఎంతో ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ టీవిషో 15వ సీజన్ నడుస్తోంది. 14 సీజన్‌లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ షోలో అమితాబ్ బచ్చన్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. భార్య జయాబచ్చన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఓ టీవి షో తన మనసులో మాటను భయటపెట్టారు : ఇంతకుముందు కూడా చాలా సార్లు ఈ టీవిషో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు అమితాబ్ బచ్చన్. తాజాగా ఈ షో 40 వ ఎపిసోడ్‌లో జయాపటేల్ అనే మహిళ పాల్గొన్నారు. ఆమె చత్తీస్‌గడ్‌కు చెందినవారు. సాధారణంగా ఈ షోలో ప్రతి కంటెస్టెంట్ గురించి కొన్ని పర్సనల్ విషయాలను అడుగుతుంటారు బిగ్‌బి. అందులో భాగంగానే జయాపటేల్‌ను మీరు ఒక ఉపాధ్యాయురాలైతే పిల్లలతో ఎలా ఉంటారు. కఠినంగా ఉంటారా, లేక సరదాగా ఉంటారా? అని అమితాబ్ బచ్చన్ అడిగారు. దానికి ఆమె చెప్పిన సమాధానం. సార్, నేను బోధించే సమయాల్లో కఠినంగానే ఉంటాను. మిగతా సమయాల్లో పిల్లలతో సరాదాగనే ఉంటాను అన్నారు. ఆ తర్వాత జయాపటేల్ కూడా అమితాబ్ బచ్చన్‌ని జయాబచ్చన్ గురించి ఓ ప్రశ్న అడిగారు.

ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు : దానికి అమితాబ్ బచ్చన్ సమాధానమిస్తూ.. జయాబచ్చన్ నా పట్ల చాలా కఠినంగా ఉంటారు. తనంటే నాకు చాలా భయం. అయినా వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నలు ఎందుకు అడుగుతారు. జయాబచ్చన్‌తో కలిసి ఈ షో చూసేటప్పడు నాకు ఉంటుంది అసలు సినిమా. ఆ సీన్ తలుచుకుంటేనే నాకు భయమేస్తుంది. అందుకే ఇలాంటి విషయాలు నేను బయటకు చెప్పను.. అంటూ అమితాబ్ బచ్చన్ నవ్వుతూ సమాధానమిచ్చారు. అమితాబ్‌బచ్చన్ చెప్పిన ఈ మాటలు ప్రస్తతుం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications