సన్నీ డియోల్, వరుణ్ ధావన్ "బోర్డర్ 2" మూవీ ఎలా ఉందంటే..?

బాలీవుడ్ స్టార్స్ సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, ఆహాన్ శెట్టి వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన మూవీ 'బోర్డర్ 2'. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాన్ని.. టీ-సిరీస్ ఫిలిమ్స్, జేపీ ఫిలిమ్స్ బ్యానర్లపై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అటు స్టార్ హీరోలతో పాటు సోనమ్ బజ్వా, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, సుదేశ్ బెర్రీ, అన్య సింగ్, మోనా సింగ్ వంటి బలమైన తారాగణం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 1997లో విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన 'బోర్డర్‌'చిత్రానికి సీక్వెల్‌ ఇది. భారీ అంచనాల మధ్య నిన్న (జనవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తొలిరోజే సూపర్‌ హిట్‌ టాక్ సంపాదించుకుంది.

సినిమా స్టోరీ..

1971లో భారత్‌పై పాకిస్థాన్ దాడులకు వ్యూహాలు పన్నుతున్న తరుణంలో, భారత సేనలు వాటిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాయనే అంశమే 'బోర్డర్ 2' ప్రధాన కథాంశం. భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ (సన్నీ డియోల్), మేజర్ హోషియార్ సింగ్ దహియా (వరుణ్ ధావన్), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ (దిల్జిత్ దోసాంజ్), ఇండియన్ నేవీ ఆఫీసర్ ఎం.ఎస్. రావత్ (ఆహాన్ శెట్టి) కలిసి దేశ రక్షణ కోసం చేసే పోరాటమే ఈ కథ. ఈ నలుగురు జవాన్లు సరిహద్దులో అనుసరించే వ్యూహాలు, వారి వ్యక్తిగత జీవితాలు, కుటుంబాల త్యాగాలు కథను మరింత బలంగా నిలబెడతాయి. యుద్ధం కేవలం తుపాకుల పోరాటం మాత్రమే కాదని, వెనుక ఉన్న కుటుంబాల కన్నీళ్లు, త్యాగాలే అసలైన పోరాటమనే అంశాన్ని దర్శకుడు హృదయాన్ని తాకేలా చూపించాడు.

border-2-movie-starring-sunny-deol-and-varun-dhawan-review-in-telugu-also-first-day-collections-reco

మూవీ ఎలా ఉందంటే..

1997లో వచ్చిన 'బోర్డర్' చిత్రం దేశభక్తిని రగిలించిన క్లాసిక్‌గా నిలిచింది. అదే స్థాయిలో భావోద్వేగాలు కలిగించేలా 'బోర్డర్ 2'ను రూపొందించేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. మొదటి భాగంలో ఫతే సింగ్ పాకిస్థాన్ చొరబాటుదారులను ఎదుర్కొనే సన్నివేశాలతో మాస్ ఎలిమెంట్స్ బలంగా మొదలవుతాయి. అనంతరం హోషియార్, నిర్మల్ జిత్, రావత్ జీవితాల్లోని కీలక సంఘటనల ద్వారా కుటుంబ భావోద్వేగాలను మిళితం చేశాడు. 1971 యుద్ధ సన్నివేశాలతో మొదటి భాగం ముగియడంతో రెండో భాగంపై ఆసక్తి పెరుగుతుంది.

రెండో భాగంలో ఫతే సింగ్ కుమారుడు పాకిస్థాన్ ముష్కరులతో పోరాడుతూ వీరమరణం పొందే సన్నివేశం ప్రేక్షకులను తీవ్రంగా కలచివేస్తుంది. ఈ భావోద్వేగ ఘట్టం తర్వాత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాల పోరాటాలను మూడు విభిన్న కోణాల్లో అద్భుతంగా చూపించారు. ప్రతి సన్నివేశం ఉత్కంఠను పెంచుతూ సాగుతుంది. క్లైమాక్స్‌లో ఫతే సింగ్ ఒక పాక్ సైనికుడిని కాల్చి చంపే సన్నివేశం థ్రిల్లింగ్‌గా ఉండటంతో పాటు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.

ఎవరెలా చేశారంటే..

ఫతే సింగ్ పాత్రలో సన్నీ డియోల్ తన ట్రేడ్‌మార్క్ డైలాగ్ డెలివరీతో మరోసారి దేశభక్తిని రగిలించాడు. వరుణ్ ధావన్ హోషియార్ పాత్రలో గత చిత్రాలకు భిన్నంగా పరిపక్వమైన నటనతో మెప్పించాడు. దిల్జిత్ దోసాంజ్ తన సహజ నటనతో నిర్మల్ జిత్ పాత్రకు ప్రాణం పోశాడు. ఆహాన్ శెట్టి రావత్ పాత్రలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. సోనమ్ బజ్వా, మోనా సింగ్, అన్య సింగ్ వంటి సహాయక పాత్రలు కథకు భావోద్వేగ బలం చేకూర్చాయి.

border-2-movie-starring-sunny-deol-and-varun-dhawan-review-in-telugu-also-first-day-collections-reco

ప్లస్ & మైనస్ పాయింట్లు

ప్లస్ పాయింట్స్‌గా స్టార్ క్యాస్ట్, దేశభక్తి భావోద్వేగాలు, యుద్ధ సన్నివేశాల ఎగ్జిక్యూషన్ నిలుస్తాయి. అయితే కథానాయకుల కుటుంబ పాత్రల్లో పెద్దగా గుర్తింపు లేని నటులను ఎంపిక చేయడం, పాక్ ముష్కరుల పాత్రలకు సరైన బలం లేకపోవడం కొంత ప్రభావాన్ని తగ్గించాయి. మొత్తానికి బాలీవుడ్ హీరోల పవర్‌ఫుల్ నటనలతో గుర్తుండిపోయే యుద్ధ చిత్రంగా ఇది నిలుస్తుంది.

ధురంధర్‌ కలెక్షన్స్ బ్రేక్..

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి తొలి రోజు రూ. 30 కోట్ల(నెట్‌) వసూళ్లు వచ్చినట్లు మీడియా పేర్కొంది. కలెక్షన్స్‌ పరంగా చూస్తే.. ఫస్ట్ డే ఈ మూవీ 'ధురంధర్‌'ని బీట్‌ చేసినట్టు తెలుస్తోంది. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమాకి తొలి రోజు రూ. 28 కోట్ల కలెక్షన్స్‌ రాగా.. తొలిరోజు 6,146 షోస్‌ పడ్డాయి. కానీ బోర్డర్‌ 2కి 6000 షోలు మాత్రమే పడి ఈ ఘనత సాధించడం పట్ల అంతా షాక్ అవుతున్నారు. వీకెండ్‌లో కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+