SSMB 29 Movie: నువ్ మా దేవుడివి సామి.. ఇదే నీ 'దర్శనం'..
సూపర్ స్టార్ మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ను ఖరారు చేశారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న గ్రాండ్ ఈవెంట్ లో మూవీ టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇక ఈ మూవీ మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమాగా తెరకెక్కుతోంది.

ఈ మూవీలో మహేశ్ బాబు సరసన మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తోంది. అలాగే మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కోసం ఎం. ఎం. కీరవాణి కంపోజ్ చేసిన 'సంచారి' అనే పాటను రీసెంట్ గా శ్రుతి హాసన్ పాడారు. ఈ సాంగ్ ఇన్ స్టంట్ గా వైరల్ అయింది. ఇవాళ జరగబోయే ఈవెంట్ లో ఆ పాటను లైవ్ పెర్ఫార్మ్ చేయనుంది. మరోవైపు ఈవెంట్ కు భారీగా వచ్చే ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని.. డైరెక్టర్ రాజమౌళి ఇటీవల ఒక వీడియోను రిలీజ్ చేశాడు.
Demi God @urstrulyMahesh ❤️🙏 pic.twitter.com/bQZStOGxLJ
— Naveen MB Vizag (@NaveenMBVizag) November 15, 2025












Click it and Unblock the Notifications