డబ్బులు లేవని ఆ నటి నన్ను వదిలేసిందంటున్న యంగ్ హీరో..

బుల్లితెర నటి బిగ్‌బాస్ ఫేమ్ కీర్తి భట్, హీరో విజయ్ కార్తిక్ విడిపోయిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, రెండేళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుని త్వరలో పెళ్లి చేసుకుంటారని అందరూ భావించిన సమయంలోనే బ్రేకప్ ప్రకటన చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల కీర్తి భట్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. విజయ్‌ని భర్తగా ఊహించుకోలేకపోతున్నాను. మా బంధాన్ని స్నేహం వరకే పరిమితం చేయాలనుకుంటున్నాను అంటూ బ్రేకప్ విషయాన్ని వెల్లడించింది. ఆమె పోస్ట్ వెలుగులోకి రావడంతో నెటిజన్లు విజయ్ కార్తిక్‌పై విమర్శలు గుప్పించారు. కీర్తిని వదిలేయడం కరెక్ట్ కాదంటూ ఆయనను ట్రోల్ చేశారు. ఈ విమర్శలకు స్పందించిన విజయ్ కార్తిక్ తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు.

breakup-story-of-tv-actress-keerthy-bhatt-and-hero-vijay-karthik-goes-viral-on-social-media-platfor

సదరు వీడియోలో కార్తీక్ మాట్లాడుతూ.. తాను కీర్తిని వదిలేయలేదని, ఆమెనే తనను వదిలేసిందని స్పష్టంగా చెప్పాడు. విడిపోవడం తన నిర్ణయం కాదని, తాను కీర్తిని పెళ్లి చేసుకోవాలనే కోరుకున్నానని, తన కుటుంబం కూడా అదే అభిప్రాయంలో ఉందని వివరించాడు. బ్రేకప్‌కు ప్రధాన కారణం తన ఆర్థిక పరిస్థితేనని చెప్పాడు. తాను ఫైనాన్షియల్‌గా ఇంకా స్థిరపడలేదన్న కారణంతోనే కీర్తి ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించాడు. ఈ విషయం ఆమె ఇప్పటికే గత డిసెంబర్‌లోనే తనకు చెప్పిందని కూడా కార్తిక్ పేర్కొన్నాడు.

అంతేకాకుండా కీర్తి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని, తనకు ఇప్పటికే బెటర్ ఆప్షన్ దొరికిందని ఆమె తనకు స్పష్టంగా చెప్పిందని కార్తిక్ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదే వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ఆమె చెప్పినట్లు తెలిపారు. విడిపోకుండా ఉండేందుకు తాను, తన కుటుంబం, స్నేహితులు కలిసి చాలా ప్రయత్నాలు చేశామని కార్తిక్ చెప్పాడు. అయితే ఆమె నిర్ణయంలో ఎలాంటి మార్పు రాలేదని, అంత బలంగా విడిపోవాలని కోరినప్పుడు బలవంతంగా ప్రేమను కొనసాగించడం కరెక్ట్ కాదనిపించిందని పేర్కొన్నాడు.

కీర్తి ఫోటోలు సోషల్ మీడియా నుంచి తొలగించగా, తాను ఎందుకు డిలీట్ చేయలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారని కార్తిక్ తెలిపాడు. దీనిపై స్పందిస్తూ, ఒక పోస్ట్ లేదా ఫోటో డిలీట్ చేయడం ఈజీ అయినా, దాని వెనుక ఉన్న భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయని, తన బాధ తగ్గిన తర్వాతే ఆ ఫోటోలు తొలగిస్తానని చెప్పాడు. అంతే కాకుండా ఈ వ్యవహారాన్ని రాద్ధాంతం చేయవద్దని, పీఆర్ టీమ్‌లు లేదా నెటిజన్లు డబ్బుల కోసం తప్పుడు కామెంట్లు చేయొద్దని కార్తిక్ విజ్ఞప్తి చేశాడు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని, ఈ విషయాన్ని అర్థం చేసుకుని మమ్మల్ని శాంతిగా వదిలేయాలని కోరాడు. మరి ఈ విషయంలో కీర్తి భట్ మరోసారి స్పందిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+