మరో తెలుగు సినిమా ప్రాజెక్టులో సాయిపల్లవి ఫిక్స్.. హీరో ఎవరో తెలుసా..?
ఫిదా సినిమాతో నేచురల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న సాయిపల్లవి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అందం, నటన, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకులు అతిచేరువయ్యింది. తాజాగా అమరన్ మూవీలో ఇందు రెబెకా జాన్ పాత్రలో తన అసమానమైన నటనతో ఇటు తెలుగు, తమిళ ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేసింది నేచురల్ బ్యూటీ. అమరన్ చిత్రంతో మరో బ్లాక్‌బస్టర్ హిట్ సాయిపల్లవి ఖాతాలో చేరిపోయింది.
విడుదలయిన మొదటిరోజే అమరన్ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 21 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. దీపావళి పండక్కి రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమా ఇదే. అయితే, తాజాగా నటి సాయిపల్లవి తెలుగులో మరో ప్రాజెక్టుకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక, ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సీతారామాం హీరో దుల్కర్ సల్మాన్‌తో జత కట్టనున్నట్లు సమాచారం.
హీరో దుల్కర్ సల్మాన్ పవన్ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పేరు ఆకాశంలో ఒక తార. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మూవీగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు జోడిగా సాయిపల్లవి హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. ఇక, ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్నాయి.

పలు ప్రాజెక్టులు..
ప్రస్తుతం నటి సాయిపల్లవి చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజిగా ఉంది. తెలుగులో నాగచైతన్యతో తండేల్ మూవీ చేస్తోంది సాయిపల్లవి. తండేల్ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. అలాగే, బాలీవుడ్‌లోనూ రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ సరసన సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పడు మరో తెలుగు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టీ టౌన్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.












Click it and Unblock the Notifications