నా సూర్యను వదలడం కుదరదు.. జ్యోతిక పోస్ట్ వైరల్!
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు సోషల్‌మీడియాలో తన అభిమానులతో ముచ్చటించడం పరిపాటిగా మారింది. వాళ్ల వ్యక్తిగత విషయాలు, సినిమా విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటూ వాళ్లతో చిట్‌చాట్ చేస్తున్నారు. తాజాగా నటి జ్యోతిక కూడా ఇదే పనిచేసింది. కానీ ఓ అభిమాని అడిగిన ప్రశ్నతో నటి జ్యోతిక అయోమయంలో పడింది. ఆ అభిమాని అడిగిన ప్రశ్నతో భర్త సూర్యపై జ్యోతికకు ఎంతప్రేముందో మరోసారి రుజువైంది. ఇంతకీ ఆమె అడిగిన ప్రశ్న ఏంటీ? అని అనుకుంటున్నారా?
గత కొంతకాలంగా నటుడు సూర్య, జ్యోతిక విడిపోతున్నారంటూ సోషల్‌మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కానీ, ఈ వార్తలకు వారిద్దరూ స్పందించి అలాంటిదేమీ లేదని కూడా క్లారిటీ ఇచ్చేసారు. నటి జ్యోతికకు సూర్య అంటే ఎంత ప్రేమో సోషల్‌మీడియా వేదికగా మరోసారి రుజువైంది. తాజాగా, నటి జ్యోతిక సైతాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.

ఈ విజయాన్ని తన అభిమానులతో పంచుకునేందుకు ఆమె తన ఇన్‌స్టాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా జ్యోతిక చిత్రబృందాన్ని పొగుడుతూ ఓ పోస్ట్ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఇక, ఈ పోస్టుపై ఓ లేడీ నెటిజన్ స్పందించి ఇలా రాసుకొచ్చింది. మేడమ్..నేను సూర్యగారికి పదిహేనేళ్ల నుంచి వీరాభిమానిని.. సూర్యగారిని ఒక రోజు నాకు అప్పుగా ఇస్తారా..మేడమ్.. ప్లీజ్..అంటూ కామెంట్ చేసింది.
ఆయన ఎప్పటికీ మీ వారే..!
అయితే, ఆ నెటిజన్ కామెంట్‌పై జ్యోతిక వెంటనే స్పందించింది. అది మాత్రం కుదరదు అంటూ సమాధానం చెప్పింది. సూర్య ఎప్పటికీ తన వాడేనంటూ పరోక్షంగా చెప్పకనే చెప్పిన జ్యోతికకు ఓ మై గాడ్.. ఆయన ఎప్పటికీ మీవారే.. అంటూ మరో కామెంట్ చేసింది ఆ లేడి నెటిజన్. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఇక, జ్యోతిక ఇచ్చిన రిప్లయ్‌తో నెటిజన్లు కూడా తెగ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే జ్యోతికకు సూర్య అంటే ఎంతిష్టమో అని కామెంట్లు పెడుతున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications