వేణు స్వామికి ఈసారి బొమ్మ కనపడటం ఖాయమే..!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన గతంలో చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో.. వేణు స్వామిని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోయింది. సమంత, నాగచైతన్యలు వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పారాయన.ఆయన చెప్పినట్టుగానే నాగ చైతన్య , సమంతలు విడిపోయారు. దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది.

సెలబ్రిటీలు సైతం ఆయనతో పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఆయన పలువురు రాజకీయ నాయకుల జాతకాలు గురించి కూడా చెప్పడం జరిగింది. తాజాగా నాగ చైతన్య , శోభిత ధూళిపాళ నిశ్చితార్థంపై తనదైనశైలిలో రియాక్ట్ అయ్యారు. నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితం 2027 వరకు బాగానే ఉందని.. అక్కడి నుంచి వీరి వైవాహిక జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఓ మహిళ కారణంగా వీరు విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని వేణు స్వామి తెలిపారు. వీరు పెట్టుకున్న ఎంగేజ్మెంట్‌కు ముహూర్తం బలం, అలాగే జాతకం వీళ్లకు అనుకూలంగా లేవని వేణు స్వామి తేల్చేశారు. గతంలో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోతారని చెప్పినప్పటి వీడియో బైట్‌ను చూపించారు.

case against Venu Swamy and conduct an investigation

అయితే ఈ వేణు స్వామి ఇలా సెలబ్రిటీల జాతకాల గురించి బహిరంగంగా చెప్పడంపై కొన్ని మహిళా సంఘాలు ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గతంలో కోర్టు ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతూ నాగ చైతన్య , శోభిత ధూళిపాళకు లేని బాధ మీకెందుకు అని మహిళా సంఘాలను ప్రశ్నించింది. దీంతో ఈ వివాదం ముగిసిపోయింది. అయితే తాజాగా వేణు స్వామిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

జాతకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను సైతం మార్ఫింగ్ చేసి వేణు స్వామి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మూర్తి అనే వ్యక్తి ఇటీవలే నాంపల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అదేవిధంగా తనకు హాని తలపెట్టాలని చూస్తున్నట్లుగా బాధితుడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు బాధితుడి తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. వెంటనే వేణు స్వామిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని జూబ్లీహిల్స్ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. మరి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వేణు స్వామి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+