నిహారిక ఫ్రెండ్(హీరోయిన్)ను పెళ్లి చేసుకోబోతున్న మాజీ భర్త చైతన్య
నాగబాబు గారాలపట్టి నిహారిక ఇప్పుడిప్పుడే పరిశ్రమలో హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరో సినిమా నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తోంది. వీటికి ముందుగా సినిమాల్లో, వెబ్ సిరీస్ లో నటించినప్పటికీ కోరుకున్న స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో నిర్మాతగా మారి సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. ఆమెకు జొన్నలగడ్డ చైతన్యతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాలకే ఈ జంట విడిపోవడం అందరికీ షాక్ తగిలినట్లైంది.
యంగ్ హీరోయిన్ తో పెళ్లి?
ప్రస్తుతం నిహారిక ఒంటరిగా ఉంటోంది. విడాకులవల్ల చైతన్య మానసికంగా కుంగిపోవడంతో కొన్నాళ్లు ఆశ్రమంలో జీవితాన్ని గడిపాడు. కోలుకున్న తర్వాత వ్యాపారాల్లో బిజీ అయ్యాడు. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గమని చైతన్య భావించాడు. దీంతో ఆయన నిహారిక స్నేహితులురాలు, హీరోయిన్ గా రాణిస్తున్న యువతిని వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. యంగ్ హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే సినిమాల్లో రాణిస్తున్న ఆమెతో చైతన్య వివాహం త్వరలోనే జరగబోతోందంటున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

అప్పుడు తెలుస్తుంది నిహారిక స్పందన
తన స్నేహితురాలినే తన మాజీ భర్త పెళ్లి చేసుకుంటున్నాడనే విషయం తెలిసినప్పుడు నిహారిక స్పందన ఏమిటనేది తెలుస్తుంది. విడాకుల సమయంలో తాను ఎంతో కుంగిపోయానని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని తెలిపింది. మీడియా సమావేశంలో తన కష్టాలన్నింటినీ ఏకరువు పెట్టింది. అసలు విడాకుల వరకు విషయం వెళ్లకుండా ఉంటే బాగుండేదని మెగా అభిమానులు అంటున్నారు. నాగబాబు ఎక్కువగా గారాబం చేయడంవల్లే ఇటువంటి పరిస్థితి తలెత్తిందని వారికి సన్నిహితంగా ఉండేవారు చెబుతున్నారు. అయితే చైతన్యతో వచ్చిన మనస్పర్థలవల్లే విడిపోయామని, తామిద్దరి అభిప్రాయాలు కలవలేదని నిహారిక చెబుతోంది. ఏదేమైనప్పటికీ ఇద్దరూ విడిపోయి ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు.












Click it and Unblock the Notifications