అనిల్ రావిపూడికి అదిరిపోయే 'మెగా' గిఫ్ట్
మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి చూపించింది 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా. సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సంక్రాంతి బరిలో ఫుల్ కాంపిటీషన్ లో వచ్చినప్పటికి ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. 2026లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న మొదటి సినిమాగా ఇది నిలిచింది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి అన్ని వర్గాల నుంచి భారీ ఆదరణ వచ్చింది. ఈ సినిమాతో చిరంజీవిని మరోసారి తన గ్రేస్ ఏంటో అభిమానులకు చూపించారు.
అయితే 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ సక్సెస్ లో దర్శకుడు అనిల్ రావిపూడి శ్రమ దాగి ఉన్న విషయం తెలిసిందే. చిరంజీవి గత రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు నమోదు కాలేదు. ఈ క్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ కు మరచిపోలేని విజయాన్ని అందించారు. అనిల్ రావిపూడి ఇప్పటివరకూ 9 చిత్రాలకు దర్శకత్వం వహించగా అన్నీ కూడా సూపర్ హిట్స్ కావడం విశేషం. దర్శకధీరుడు రాజమౌళి లాంటి అతి కొద్ది మంది డైరెక్టర్స్ కు మాత్రమే ఈ హిస్టరీ ఉంది.
అయితే తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి మెగా గిఫ్ట్ అందించారు. అనిల్ రావిపూడికి చిరంజీవి ఓ కొత్త రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మన వర శంకర ప్రసాద్ గారు సినిమా భారీ విజయ సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ మూవీ 300 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ క్రమంలో చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడికి ఓ కొత్త రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు.

మెగాస్టార్ ఇచ్చిన గిఫ్ట్ తో దర్శకుడు అనిల్ రావిపూడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే అనిల్ రావిపూడికి కారు ఇచ్చిన సందర్భంగా చిరంజీవి కొన్ని సూచనలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని అన్నారు. కారు నచ్చిందా..? అని చిరు అడగ్గా 'మెగా బహుమతి మహదానందం మనోధైర్యం ధనాధన్' అంటూ అనిల్ రావిపూడి అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications