సెల్ఫీ కోసం వచ్చిన వ్యక్తిని నెట్టేసిన చిరంజీవి (వీడియో)
మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవితో సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ అభిమానిని , ఆయన పక్కకు నెట్టేసిన వీడియో నెట్టింట్ సంచలనంగా మారింది. చిరంజీవి ఫ్యామిలీతో కలిసి పారిస్‌కు వెళ్లారు. కొడుకు రామ్ చరణ్ కూడా ఈ విదేశి పర్యటనకు వెళ్లారు. మెగా ఫ్యామిలీ పారిస్ టూర్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. అయితే చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా, విమానాశ్రయ సిబ్బంది కొందరు ఆయనతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు.
అందులో ఒకరు తన మొబైల్ ఫోన్‌తో సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నించాడు. మొదట అతన్ని తప్పించుకుని వెళ్లిపోగా, అయినప్పటికి అతను చిరంజీవితో ఫొటో కోసం మరోసారి ప్రయత్నించాడు. దీంతో అతనిపై చిరంజీవి అసహనం వ్యక్తం చేస్తూ..అతన్ని తన చేతితో చిరంజీవి పక్కకు నెట్టేశారు. చిరంజీవి అతన్ని మెల్లగా పక్కకి నెట్టడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో , చిరంజీవి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంత పెద్ద హీరో అయ్యిండి, సెల్ఫీ తీసుకునే వ్యక్తి పట్ల అలాంటి దురుసు ప్రవర్తన సరికాదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

"సెలబ్రెటీ ఎవరైనా ఒక్కటే. ఆఫ్ కెమెరాలో అది చిరంజీవి అయినా ఇంకెవరైనా.. ముందు వాళ్ళని అంత ఎత్తులో చూడడం మానేయాలి. నీ కంటే హీరో ఎవరు ఉండరు అనే ఆత్మాభిమానం ఉండాలి" అని ఓ నెటిజన్ ఈ వీడియోపై కామెంట్ పెట్టారు.గతంలో రామ్ చరణ్ సైతం ఇదే మాదిరిగా అభిమానిపై దురుసుగా ప్రవర్తించారు. పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆ కార్యక్రమానికి హాజరైయ్యారు.
సెల్ఫీ కోసం వచ్చిన వ్యక్తిని నెట్టేసిన చిరంజీవి..! #Chiranjeevi #MegaStarChiranjeevi #ViralVideo #Airport #Tollywood #Oneindiatelugu pic.twitter.com/PrNQvXUu50
— oneindiatelugu (@oneindiatelugu) July 30, 2024
రామ్ చరణ్ సైతం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఈ సమయంలో ఓ అభిమాని రామ్ చరణ్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే రామ్ చరణ్ అతన్ని తన చేత్తో పక్కకి నెట్టేశాడు. మరోవ్యక్తి కూడా రామ్ చరణ్‌తో ఫొటో దిగడానికి ప్రయత్నించాడు..అతన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications