నాగ చైతన్య, సమంత విడాకులకు చిరంజీవి కారణమా..? బయటపడ్డ అసలు నిజం

హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.

అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

Chiranjeevi the reason for Naga Chaitanya and Samantha s divorce

అయితే వీరి విడాకులపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నారనే సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగ చైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదిస్తున్నారు.

విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. అయితే వీరి విడాకులకు స్పష్టమైన కారణం ఏంటనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. తాజాగా వీరి విడాకులకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. సమంత , నాగచైతన్య విడాకులకు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ కారణమనేది ఈ వార్త సారాంశం. అది ఎలాగో ఓసారి చూద్దాం.

పెళ్లైన తర్వాత సమంతకు రామ్‌చరణ్ సరసన నటించే అవకాశం వచ్చింది. రంగస్థలం సినిమాలో ఆఫర్ రావడంతో , ఇందులో సమంతను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. అయితే సమంతను హీరోయిన్‌గా తీసుకోవాలా వద్దా అని టీం చాలా ఆలోచించిందంట. అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లిందిగా, ఇప్పుడు సినిమాలు చేస్తుందో లేదో అని చిరుతో మాట్లాడగా, ఆయన పెళ్లి అయిపోతేనే, ఆమె ఒక హీరోయిన్‌ కదా.. క్యారెక్టర్ నచ్చితే చేయమని చెప్పండంటూ చిత్ర యూనిట్‌కు చెప్పారట.

ఆ పాత్ర కూడా సమంతకు నచ్చడంతో ఒకే చేసి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో పెళ్లి తర్వాత సమంత మళ్లీ తన నటనతో మంచి ఫేమ్ సంపాదించాలని, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత సమంత, నాగ చైతన్యల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఈ జంట విడాకులు తీసుకోవడం జరిగింది. దీంతో సమంత నాగచైతన్యల విడాకులకు పరోక్షంగా చిరు కూడా కారణం అయ్యారనే వాదన తెర మీదకు వచ్చింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+