చిరంజీవి కుటుంబంలో చీలిక?

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో చీలిక వచ్చిందా? లేదంటే గతంలోనే ఉందా? అనే చర్చ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తోంది. ఎన్నికలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీనికితోడు మెగా కుటుంబంలో చీలిక వచ్చింది అనే వార్తతో మరికొంత వేడి పెరిగింది. జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. తనకు మద్దతుగా మొత్తం చిరంజీవి కుటుంబం నిలిచింది. వరుణ్ తేజ్, సాయిదుర్గాతేజ్, వైష్ణవ్ తేజ్.. తదితరులంతా పిఠాపురంలో పర్యటించారు. చిరంజీవి బహిరంగంగానే తన తమ్ముడికి మద్దతు ప్రకటించారు.

సోషల్ మీడియా ద్వారా మద్దతు
ప్రచారం చివరి రోజు రామ్ చరణ్, చిరంజీవి భార్య సురేఖ, అల్లు అరవింద్ కూడా పిఠాపురంలో పర్యటించి పవన్ కల్యాణ్ కు మద్దతు తెలియజేయడంతోపాటు గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. దీనికి ఒకరోజు ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ కు మద్దతు తెలియజేశారు. రాజకీయంగా మామయ్య అనుకున్నది సాధించాలని అభిలషిస్తున్నట్లు తెలిపారు. ఒక ఫ్యామిలీ మెంబర్ గా తన సపోర్ట్ ఎల్లప్పుడూ మీకే ఉంటుందని, మీరు ఎంచుకున్న మార్గానికి, చేస్తున్న సేవను చూసి గర్వపడుతున్నానని" అన్నారు.

chiru vs allu arjun split in megastar chiranjeevi family

అభిమానులు దూరమవుతారా?
నేరుగా పిఠాపురం వచ్చి మద్దతు తెలియజేస్తే అన్ని పార్టీల్లో ఉన్న అభిమానులు దూరమవుతారని భావించడం సహజం. దీనికి తరుణోపాయంగా సోషల్ మీడియాద్వారా మద్దతిచ్చారు. అంతవరకు బాగానేవుందికానీ రామ్ చరణ్ కూడా స్టార్ హీరోనే. అన్ని రాజకీయ పార్టీల్లో కూడా అతని అభిమానులు ఉన్నారు. అయినా చెర్రీ నేరుగా పిఠాపురం వచ్చి పవన్ కు మద్దతు తెలియజేశారు. అల్లు అర్జున్ తన స్నేహితుడు, నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి మద్దతు తెలిపారు. ఆ మద్దతు పిఠాపురం వచ్చి ఎందుకు తెలియజేయలేదనేది విశ్లషకులు సంధిస్తున్న ప్రశ్న. మెగా కుటుంబంలో విభేదాలున్నాయనేది ఇంతకంటే నిదర్శనం ఏం కావాలంటున్నారు.

నంద్యాల వెళితే దూరమవరా?
నంద్యాల నుంచి పోటీచేస్తున్న తన స్నేహితుడు వైసీపీ అని అల్లు అర్జున్ కు తెలుసుకదా.. అక్కడికి వెళితే మిగతా పార్టీల్లో ఉన్న అభిమానులు దూరమవుతారని ఆలోచించలేకపోయాడా? పిఠాపురం వెళితే దూరమవుతారనే ఆలోచన కలగగా, నంద్యాల వెళితే దూరమవరా? అనేది బన్నీకి తట్టలేదా? అని రాజకీయ, సినీ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వీటికి సమాధానం మెగా కుటుంబం మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ మెగా కుటుంబంలో విభేదాలున్నాయనేదానికి ప్రస్తుత పరిణామాలు కూడా ఊతమిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+