నా జీవితంలో సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది.. సితార ఎమోషనల్ పోస్ట్..
నేడు జాతీయ సినిమా దినోత్సవం ఈ సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు కూతురు సితార తాజాగా, సోషల్‌మీడియాలో ఓ పోస్టు చేశారు. ఈ పోస్టు ఇప్పడు ట్రెండింగ్‌గా మారింది. నా జీవితంలో సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉందని, నాకు సినిమా అంటే కేవలం ఒక చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు.. నా డిఎన్ఎలో ఓ భాగమంటూ... మహేష్‌బాబు కూతురు సితారా ఎమోషన్‌ల్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ను తన తండ్రి మహేష్‌బాబుకు, తాత కృష్ణకు డెడికేట్ చేస్తూ పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
సితార ఎమోషనల్ పోస్ట్ : సితార ముందునుంచే సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక పోస్టులు పెట్టి అభిమానుల మనసులను గెలుచుకుంటున్నారు. ఈ రోజు నేషనల్ సినిమా డే సందర్భంగా ఆమె తన తండ్రి, తాతకు ఈ పోస్ట్‌ను అంకితం చేశారు. ఈ పోస్ట్ తో పాటు ఒక అందమైన ఫోటోను కూడా పంచుకున్నారు. దీంతోపాటు నాన్నగురించి, తాత గురించి ఓ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. వెండితెరపై అగ్రగామిగా నిలిచిన మా నాన్నకు తన తండ్రి ఎలా ఉండేవారో.. అలాగే నాకూ మా నాన్న స్ఫూర్తిగా నిలిచారు.

లెజెండరీ ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ కృష్ణ మా తాతగారు మా అందరిపై ఇంతంటి గాఢమైన ప్రభావం చూపారు. ఆయన వారసత్వంలో భాగమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇక నా జీవితంలో 'సినిమా'కు ప్రత్యేక స్థానం ఉంది. సినిమా అంటే నాకు కేవలం చిత్రపరిశ్రమ కాదు. నా డీఎన్ఏలో ఓ భాగం సినిమా. నా కుటుంబ సినీ ప్రయాణాన్ని ఇష్టపడుతున్న, ఆదరిస్తున్న అభిమానులందరికీ జాతీయ సినిమా దినోత్సవ శుభాకాంక్షలు.. అంటూ పోస్ట్ చేసింది సితార. తాత, తండ్రి, సోదరుడు గౌతమ్, అమ్మ నమ్రతా ఓకే ఫ్రేమ్ లో ఉన్నఫొటోను కూడా షేర్ చేసింది.
కమర్షియల్ యాడ్‌లో నటించిన సితార : కొద్దిరోజుల కింద సితార ఓ ఇంటర్నేషనల్ కమర్షియల్ యాడ్ కూడా చేసి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. సితార పలు సేవాకార్యక్రమాలనూ చేస్తూ పెద్ద మనస్సును చాటుకుంటోంది. ప్రస్తుతం స్కూలింగ్ చేస్తున్న సితార ఇటు సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పడు తన సినీ కెరీర్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
2019లో వచ్చిన ఇంగ్లీష్ ఫాంటసీ చిత్రం ఫ్రోజెన్ 2కు తెలుగు వెర్షన్‌లో బేబీ ఎల్సా పాత్రకు సితార తన గాత్రాన్ని అందించింది. అలాగే 'సర్కారు వారి పాట'లోనూ 'పెన్నీ' సాంగ్ లో తన డాన్స్‌తో అభిమానులను అలరించింది. అయితే ఇప్పుడు మరోసారి సినిమా దినోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసి అభిమానుల హృదయాలను తాకింది. జాతీయ సినిమా దినోత్సవాన్ని 2022లో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) రూపొందించింది.












Click it and Unblock the Notifications