విడాకులైనా సమంతను వదిలిపెట్టని నాగచైతన్య?
అక్కినేని నాగచైతన్య - సమంత జంట చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతుంటారు. వారిద్దరు ప్రేమించి పెళ్లిచేసుకున్న తర్వాత ఎంత పాపులర్ అయ్యారో విడిపోయిన తర్వాత అంతకంటే ఎక్కువగా పాపులర్ అయ్యారు. వీరిద్దరూ విడిపోతారు అనేది అక్కినేని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. అభిమానులందరికీ వీరి విడాకుల వ్యవహారం షాక్ కు గురిచేసింది. అయినప్పటికీ ఇప్పటికీ వీరిద్దరూ కలిసిపోవాలంటూ అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు.
తాజాగా సోషల్ మీడియాలో మరోసారి నాగచైతన్య, సమంత అభిమానుల మధ్య యుద్ధం నడుస్తోంది. విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన సోషల్ మీడియా ఖాతాల నుంచి నాగచైతన్య ను అన్ ఫాలో చేసింది. అయితే నాగచైతన్య మాత్రం అలా చేయలేదు. ఇప్పటికీ సమంతను ఫాలో అవుతున్నాడు. ఇంతకంటే సమంత మీద ప్రేమ ఉంది అని ప్రత్యేకంగా నిరూపించుకోవాలా? అని నాగచైతన్య ఫ్యాన్స్ సమంత ఫ్యాన్స్ ను నిలదీస్తున్నారు. నాగచైతన్య బంగారం లాంటి వ్యక్తి అని, నిజమైన ప్రేమ అంటే నాగచైతన్యదే అని, చిన్న చిన్న కారణాలు, అపోహలతో సమంత తొందరపడిందని నాగచైతన్య ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

విడాకులు తీసుకున్న తర్వాత పలు సందర్భాల్లో సమంత మాట్లాడిన మాటలు పరోక్షంగా నాగచైతన్యను విమర్శించేవిగా ఉన్నాయని, కానీ ఏరోజు నాగచైతన్య నోరు తెరిచి సమంతను విమర్శించలేదని, రెండు సందర్భాల్లో అయితే కొనియాడాడని గుర్తుచేస్తున్నారు. వీళ్లిద్దరూ విడిపోయి మూడు సంవత్సరాలవుతున్నప్పటికీ కచ్చితంగా కలిసిపోవాలని, వీరిద్దరి జంట బాగుంటుందని, ఇద్దరికి ఒకరిపై ఒకరంటే చెప్పలేనంత ప్రేమ ఉందంటూ ఇద్దరి అభిమానులు కోరుతున్నారు. పరోక్షంగా తననే అంటోందని నాగచైతన్యకు అర్థమైనప్పటికీ ఇప్పటివరకు చిన్న మాటకూడా మాట్లాడలేదని నాగచైతన్య ఫ్యాన్స్ అంటున్నారు. వీరిద్దరూ తిరిగి కలుస్తారో? అలాగే ఉండిపోతారో? ఏం జరుగుతుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications