నాగార్జున - పవన్‌కల్యాణ్ మధ్య విభేదాలు... అందుకే ఆహ్వాన పత్రిక అందలేదు?

కింగ్ అక్కినేని నాగార్జున తన చిన్నకొడుకు అక్కినేని అఖిల్ వివాహాన్ని జరిపించారు. జైనబ్ రబ్జీతో జరిగిన ఈ వివాహం హైదరాబాద్ లోని నాగార్జున ఇంట్లోనే జరిగింది. అతికొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈనెల 8వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్న రిసెప్షన్ కు మాత్రం సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులంతా పాల్గొనబోతున్నారు. వివాహానికి చిరంజీవి కుటుంబం, రాజమౌళి తనయుడు కార్తికేయ, ప్రశాంత్ నీల్, శర్వానంద్ తదితరులు హాజరయ్యారు. వివాహంతోపాటు రిసెప్షన్ కు రావాలంటూ నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కూడా ఆహ్వానించారు.

చంద్రబాబును పిలిచి పవన్ ను పిలవలేదు
అయితే అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను మాత్రం ఆహ్వానించలేదు. నాగార్జున, పవన్ కల్యాణ్ మధ్య స్వల్ప విభేదాలున్నాయని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి కుటుంబంతో నాగార్జునకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. అటువంటప్పుడు పవన్ కల్యాణ్ తో విభేదాలుండాల్సిన అవసరం లేదని అక్కినేని అభిమానులు అంటున్నారు. సినీ పరిశ్రమ నుంచి వెళ్లి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ ను ఎందుకు ఆహ్వానించలేదని పవర్ స్టార్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. నాగార్జున అమరావతికి వచ్చిన సమయంలో పవన్ కల్యాణ్ లేరని, ఓజీ షూటింగ్ లో పాల్గొనేందుకు ముంబయి వెళ్లారని అంటున్నారు.

clashes between Akkineni Nagarjuna and ap deputy cm pawan kalyan

నాగార్జునకు జగన్ ఆప్తమిత్రుడు
అయితే నాగార్జునకు జగన్ ఆప్తమిత్రుడు. జగన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ప్రత్యర్థి. ఈ కోణంలోనే నాగార్జున పవన్ ను ఆహ్వానించలేదని మరికొందరు అంటున్నారు. అయితే రాజకీయాలకు, సినిమాలకు సంబంధం లేదని, నాగార్జున వైసీపీలో ఉన్నప్పటికీ చంద్రబాబును ఆహ్వానించారని, కాబట్టి పవన్ అందుబాటులో లేకపోవడంవల్లే నాగార్జున పిలవలేకపోయారంటున్నారు. అయితే వాస్తవం ఏమిటనేది వారికే తెలియాలి. కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయాల ప్రకారం అయితే నాగార్జున, పవన్ కల్యాణ్ మధ్య చిన్న గ్యాప్ ఉందంటున్నారు. ఒకవేళ గ్యాప్ ఉంటే చిరంజీవి దాన్ని సరిజేయవచ్చుకదా అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+