తెలుగు సినీ పరిశ్రమలోని రాజకీయాలతో పోలిస్తే ఏపీ, తెలంగాణ రాజకీయాలు ‘వేస్ట్’
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నన్ని రాజకీయాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండవని చెప్పొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ఏపీ, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు తెలుగు సినీ పరిశ్రమను చూసి రాజకీయాలు నేర్చుకోవాలి. ఇక్కడ పైకి పొగుడుతారు. ఎదురుగా ముఖస్తుతి చేస్తారు. వెనక మాత్రం భయంకరంగా తిడతారు. అంతేకాదు.. రాజకీయాలు చేస్తుంటారు. మనముందు పొగిడినవారు, మనముందు ఎంతో మంచిగా, ఆప్యాయంగా మాట్లాడినవారు అలా ఎందుకు చేస్తారులే అని ఆ రాజకీయానికి బలయ్యే ప్రముఖులు అనుకుంటుంటారు. కానీ అదే వాస్తవమని వారికి ఎప్పుడు తెలుస్తుందంటే చేతులు కాలిని తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా... జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది. కానీ అప్పటికి చేయగలిగింది ఏమీ ఉండదు.
తమ పని తాము చేసుకుపోయేవారు అరుదు
ఇలా పరిశ్రమలో రాజకీయాలు చేసేవారు 80 శాతం మంది ఉంటే, 20 శాతం మంది మాత్రం వేటినీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతుంటారు. పరిశ్రమలో ఇలాంటివారు చాలా అరుదు అని చెప్పొచ్చు. ఒకరిజోలికి వెళ్లకపోవడం, ఒకరి గురించి మాట్లాడకపోవడం, ఒకరు విజయం సాధిస్తే తమ విజయంగా పొంగిపోవడం, నిజమైన ప్రేమ, అభిమానం, ఆప్యాయత చూపించేవారు వేళ్లమీద లెక్కపెట్టగలిగే స్థాయిలోనే ఉంటారు. సినీ పరిశ్రమలో సంవత్సరాల తరబడి నెగ్గుకురావాలంటే ఈ రాజకీయాలన్నీ చేయాలి, లేదంటే ఈ రాజకీయాలకు ఎదుర్కునే రాజకీయం అన్నా చేయగలిగే సామర్థ్యం ఉండాలి. లేదంటే వెనక బలమైన అండ ఉండాలి. అలా ఉన్నవారే నెగ్గుకు రాగలుగుతారు.

రాజకీయాల గురించి అందరికీ తెలుసు
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సినీ అభిమానులకు, సినీ ప్రియులకు తెలుగు పరిశ్రమలో ఉండే రాజకీయాలు తెలుసు.. ఎవరు ఎవరిపై రాజకీయాలు చేస్తుంటారనేది తెలుసు.. అలా రాజకీయాలు చేసేవారు ఎంత మంది ఉన్నారు? గతంలో జరిగిన సంఘటనలేంటి? జరగబోయేవి ఏంటి? అనే విషయాలు కూడా తెలుసు. ఇలా రాజకీయాలు చేసేవారిలో హీరోలుంటారు.. నిర్మాతలుంటారు.. దర్శకులుంటారు.. పరిశ్రమలోని 24 విభాగాలకు సంబంధంలేనివారు కూడా ఉంటారంటే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. అడుగు తీసి అడుగేస్తే రాజకీయమయంగా ఉండే తెలుగు సినీ పరిశ్రమ అనే చదరంగంలో నెగ్గుకురావాలంటే ఎవరికైనా రెండు లక్షణాలుండాలి. ఒకటి.. తెర వెనక రాజకీయం.. రెండు.. ఆ రాజకీయాన్ని గట్టిగా తిప్పికొట్టగలిగే రాజకీయం.












Click it and Unblock the Notifications