కాకినాడ శ్రీదేవి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజెన్లు..

ఇన్ స్టా గ్రామ్ రీల్స్, యూట్యుబ్ లో షార్ట్ ఫిల్మ్స్ తో తమ టాలెంట్ నిరూపించుకుని సినిమా ఛాన్సులు కొట్టిన వారు చాలామందే ఉన్నారు. అలా ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తొలి సినిమా అవకాశం సాధించింది ఫేమస్ అయింది కాకినాడకు చెందిన శ్రీదేవి అలియాస్ శ్రీదేవి అప్పాల. కోర్టు మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన శ్రీదేవి.. తొలి సినిమాతోనే తన నటనతో ఫుల్ క్రేజ్ సంపాదించింది. ఈ మూవీలో జాబిలి పాత్రలో శ్రీదేవి యాక్టింగ్ కు యూత్ ఫిదా అయిపోయారు. తొలి సినిమాకే ఎంతో పరిణతితో కూడిన నటనను ఆమె ప్రదర్శించింది. దీంతో ఆమెకు ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

ఇటీవలే ఓ తమిళ సినిమాలోనూ నటించేందుకు కాకినాడ శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీ ఇటీవల ప్రారంభం అయింది. అయితే తాజాగా శ్రీదేవికి మరో గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక గామా అవార్డ్స్ కు ఆమెను ఆహ్వానిస్తూ గామా అవార్డ్స్ బృందం ఓ సందేశం పంపింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

"గామా అవార్డ్స్ దుబాయ్ ప్రేక్షకుల మధ్య ఘనంగా జరుపుకుంటుంది. ఈ షోకు ఓ కొత్త నటి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆమెకు గామా తరఫున వెల్కమ్ చెబుతాం. కోర్టు మూవీలో జాబిలిగా నటించిన హీరోయిన్ శ్రీదేవి.. కాకినాడలో పుట్టిపెరిగింది. ఇంటర్ చదువుతోంది. సోషల్ మీడియాలో వీడియోలు చేసేది. నాని నిర్మించిన కోర్టు మూవీతో వెండితెరకు పరిచయం అయింది. ఆమె అసలు పేరు శ్రీదేవి అప్పల. కోర్టు మూవీలో నటనకు మంచి గుర్తింపు లభించింది. త్వరలోనే ఓ తమిళ సినిమాలోనూ నటించనుంది. సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా ఎదగాలని ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్. స్వాగతం పలుకుదాం" అని పోస్టు పెట్టింది.

Court Actress Sridevi Apalla Honored with GAMA Awards 2025 Invitation

ఇక దుబాయ్ వేదికగా జరగనున్న 'గామా' అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. 5వ ఎడిషన్ ఆగస్టు 30న షార్జా ఎక్స్‌పో సెంటర్‌ ‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ లో ఇటీవల కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు. 2024లో విడుదలైన చిత్రాలకు 24 క్రాఫ్ట్స్ విభాగాల్లో పురస్కారాలు అందజేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+