బిగ్ బాస్ కంటెస్టెంట్, నటికి బెయిల్ మంజూరు, సోషల్ మీడియాలో పాపులర్, ఏ కేసులో అంటే!
తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తో పాపులారీ సంపాదించుకున్న బిగ్ బాస్ కన్నడ కంటెస్టెంట్ సోనూ గౌడకు అనధికారికంగా బిడ్డను దత్తత తీసుకున్న కేసులో బెయిల్ మంజూరైంది.
కర్ణాటకలోని రాయచూరుకు చెందిన కూలీ దంపతుల కుమార్తెను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో ఇదే ఏడాది మార్చి 25వ తేదీన నటి సోనూ గౌడను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

సోనూ గౌడను కోర్టులో హాజరుపరచగా విచారించని న్యాయమూర్తి 5 రోజులుగా పోలీసుల కస్టడీకి అప్పగించారు. అయితే ఐదు రోజులైనా విచారణ పూర్తి కాకపోవడంతో పోలీసులు మరి కొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు మనవి చేశారు. పోలీసుల తరఫు వాదనలు విన్న కోర్టు సోనూ గౌడను పోలీసు కస్టడీకి ఇవ్వడానికి నిరాకరించి ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.కోర్టు ఆదేశాల అనంతరం సోనూ శ్రీనివాస్ గౌడ్‌ను బెంగళూరు నగర శివార్లలోని పరప్ప అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.
మార్చి 25వ తేదీన అరెస్టు అయ్యి విచారణ ఖైదీగా జైలు శిక్ష అనుభవిస్తున్న సోనూ గౌడ బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన బెంగళూరు రూరల్ సీజేఎం కోర్టు ఆడపిల్లను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో సోనూ శ్రీనివాస్ గౌడ్‌కు బెయిల్ మంజూరు చేసింది.

కోర్టు విధించిన కొన్ని షరతులతో సోనూ గౌడ జైలు నుంచి బయటకు వచ్చారు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమస్ అయిన సోనూ గౌడ తరువాత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఇంకా పాపులర్ అయ్యారు. తరువాత బెంగళూరులో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కూలి పనులు చేసుకుంటున్న దంపతుల కుమార్తెను సోనూ గౌడ అక్రమంగా దత్తత తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని స్వచ్చంద సంస్థలు సోనూ గౌడ మీద సీరియస్ అయ్యాయి.
దత్తత తీసుకున్న అమ్మాయితో కలిసి సోనూ గౌడ కొన్ని ఫోటోలు, వీడియోలు తీసుకుని వాటిని సోషలో మీడియాలో పోస్టు చెయ్యడంతో వివాదం మొదలైయ్యింది. ఇదే కేసులో సోనూ గౌడను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన సోనూ గౌడ తరువాత ఎలా స్పందిస్తారు ?, బాలికను చట్టపరంగా మరోసారి దత్తత తీసుకుంటారా ?, లేక ఆ బాలికను ఏం చేస్తారు ? అని ఆమె అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు.












Click it and Unblock the Notifications