పుష్ప 2 సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌.. త్వ‌ర‌లో మ‌రో టీజ‌ర్‌..!

పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో ఆయ‌నకు ప్ర‌పంచంలోనే ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా ప‌లు భాష‌ల్లో రిలీజ‌య్యి బ్లాక్ బస్ట‌ర్ హిట్‌ను అందుకుంది. ఇక‌, తాజాగా రాబోతున్న పుష్ప 2 సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక‌, ఇటీవ‌లే విడుద‌ల‌య్యిన పుష్ప 2 టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌నే వ‌చ్చింది. అయితే, ఈ సినిమా నుంచి మ‌రో క్రేజీ అప్‌డేట్ అందింది. అభిమానుల్లో మరింత జోష్ నింపేందుకు పుష్ప 2 నుంచి మరో టీజర్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోన్న‌ట్లు స‌మ‌చారం. ఈ న్యూస్ విన్న బ‌న్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప-2. ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు భారీస్థాయిలో పెరిగిపోతున్నాయి. ఆ సినిమా గురించి వ‌చ్చిన వార్త‌లు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవ‌లే అల్లుఅర్జున్ పుట్టిన‌రోజు సందర్భంగా మూవీ మేకర్స్​ పుష్ప 2 టీజర్ ను వ‌దిలారు. ఇక‌, ఈ టీజ‌ర్‌పై అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్​ వచ్చింది. ఈ టీజ‌ర్‌ను విడుద‌ల‌యిన కొద్ది క్ష‌ణాల్లోనే యూట్యూబ్​ను సైతం షేక్ చేసింది. ఇక‌, ఈ టీజర్​లో అల్లుఅర్జున్ అమ్మోరు గెటప్​లో క‌నిపిస్తారు. బ‌న్నీనీ ఈ గెట‌ప్‌లో చూసిన ఆయన ఫ్యాన్స్​ పూనకాలతో ఊగిపోయారు. టీజర్ చివర్లో ఫైట్ సీన్​ ఉంటుంది. అయితే, ఈ టీజ‌ర్‌కు వ‌చ్చిన భారీ రెస్పాన్స్ దృష్ట్యా ఈ సినిమా నుంచి మ‌రో టీజ‌ర్‌ను విడుద‌ల‌చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధ‌మ‌యిన‌ట్లు తెలుస్తోంది.

Crazy update from the movie Pushpa 2 Another teaser coming soon

టీజ‌ర్ అనంత‌రం పాట కూడా..

అయితే, బ‌న్నీ అభిమానుల్లో మ‌రోసారి ఫుల్ జోష్​ నింపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. పుష్ప 2 సినిమా నుంచి మరో టీజర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యిందని టాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌. ఇక‌, రాబోయే ఈ టీజ‌ర్‌లో పలు డైలాగ్స్​తోపాటు, మరో యాక్షన్ సీన్​ ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది. ఈ టీజ‌ర్ అనంత‌రం ఓ పాటను సైతం విడుదల చేయాలని మూవీ మేకర్స్ అనుకుంటున్న‌ట్లు సమాచారం. అయితే, ఈ విష‌యంపై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. ఇదే నిజ‌మైతే ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే అని చెప్పుకోవాలి. ఏది ఏమైనా పుష్ప 2 కోసం బ‌న్నీ అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+