వామ్మె సిరాజ్ మాములోడు కాదు.. ఏకంగా ఆ సింగర్‌తో డేటింగ్ ..?
రొమాన్స్, ఎఫైర్లు అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. ఇక సినీ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగుతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి కాస్తా ఎక్కువుగా కనిపిస్తుంటాయి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. అయితే చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఇండియన్ క్రికెటర్స్‌తో ప్రేమాయణం సాగించారు. కపిల్ దేవ్, కమల్ హాసన్ మాజీ భార్య సారికల మధ్య కొన్నాళ్లు లవ్ నడించింది.
ఇక హీరోయిన్ నగ్మ, సౌరవ్ గంగోలి గురించి అయితే ఏకంగా మీడియాలోనే అనేక కథనాలు వెలువడ్డాయి. యువరాజ్ సింగ్ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె , ధోని హీరోయిన్ రాయ్ లక్ష్మి వంటి వారి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ సైతం ఓ క్రికెటర్‌తో ప్రేమాయణం సాగించింది. టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా-మాధురి దీక్షిత్‌ల మధ్య కొన్నాళ్లు ప్రేమ నడిచింది. నేటితరం హీరోయిన్లు సైతం క్రికెటర్స్‌తో ఎఫైర్లు కొనసాగిస్తున్నారు.

తాజాగా ఈ లిస్ట్‌లో హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కూడా చేరాడనే వార్తలు వినిపిస్తున్నాయి. లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మనవరాలు జానాయ్ భోంస్లేతో సిరాజ్ డేటింగ్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. జానాయ్ భోంస్లే పుట్టిన రోజు వేడుకలు ఇటీవలే జరిగాయి. ఆ వేడుకల్లో సిరాజ్ సైతం దర్శనం ఇచ్చాడు. వీరిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరు ప్రేమ ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది.
దీనికి తోడు ఒకరినొకరు ఇన్‌స్టాలో ఫాలో అవుతుండడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చినట్టు అయింది. ఇది చూసిన నెటిజన్స్ సిరాజ్ భాయ్ డేటింగ్‌లో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంటూ ఈ జంటను ప్రశ్నిస్తున్నారు. . మరోవైపు జనాయి భోంస్లే విషయానికొస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఆమె ఆశా భోంస్లే కుమారుడైన ఆనంద్ భోంస్లే కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మరి జానాయ్ భోంస్లేతో డేటింగ్ వార్తలపై సిరాజ్ భాయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications