నీవల్ల ఇండస్ట్రీ మొత్తం సీఎం ముందు తల దించుకుంది... నీ ఇంట్లో ఎగురు!
సంధ్య థియేటర్ లో తొక్కిసలాట.. 35 ఏళ్ల రేవతి మృతి చెందడం.. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుండటం.. అల్లు అర్జున్ అరెస్ట్.. విడుదల తర్వాత ఆయనకు పరామర్శలు.. లైవ్ స్ట్రీమింగ్.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బన్నీతోపాటు సినీ పరిశ్రమపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం.. వెంటనే పరిశ్రమ ప్రముఖులంతా సీఎం దగ్గరకు పరిగెత్తుకుంటూ రావడం ఒకదానివెంట ఒకటి జరుగుతూ వచ్చాయి. సెలబ్రిటీలంతా రెండున్నర గంటల సమయం ముఖ్యమంత్రితో చర్చించారు. పరిశ్రమకు ఏం కావాలో ఆయన్ను అడిగారు. ఒకర్నొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనపరిచారు.
ఇంటి దగ్గర డ్యాన్స్ వేసుకో
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో పరోక్షంగా మండిపడ్డారు. నీ ఇంట్లో నువ్వు ఏమన్నా చేసుకో.. డ్యాన్స్ వేసుకో.. ఏమన్నా చేసుకో.. బయటకు వచ్చినప్పుడు.. అందులోను ప్రజలున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా, పద్దతిగా ఉండాలి.. అంటూ ధ్వజమెత్తారు. అందరూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.. బయటకు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలనేది పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలన్నారు.ఆ తర్వాత ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా అల్లు అర్జున్ దే తప్పు అన్నట్లు చెప్పారు. అల్లు అర్జున్ వల్లే సినీ పరిశ్రమ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

ఖరాఖండిగా తేల్చేసిన రేవంత్ రెడ్డి
అల్లు అర్జున్ పై తమ్మారెడ్డి దుమ్మెత్తిపోశారు. కావాలనే తప్పు చేయకపోయినా జరిగిన తప్పుకు అతడే కారకుడయ్యాడని, థియేటర్ వద్ద రోడ్ షో చేయడం ఏమిటని, హంగామా చేయాలా? అంటూ ప్రశ్నించారు. తప్పు చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకోలేమని, కానీ కవర్ చేసుకోవడానికి వంద అబద్దాలు ఆడాల్సి వచ్చిందన్నారు. ఇదే ప్రస్తుతం ప్రభుత్వానికి కీలకంగా మారిందన్నారు. జరిగిన పరిణామాలన్నీ కలిపి పరిశ్రమను సీఎం ఎదుట తలదించుకునేలా చేశాయని, ఒకరకంగా కొన్ని దశాబ్దాల ఘనమైన చరిత్ర ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు ఇది తలవంపులు కలిగించే పరిణామం అని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications