వామ్మో... వెంకటేష్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో దగ్గుబాటి వెంకటేష్ ఒకరు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ తన సొంత టాలెంట్ తో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. వెంకటేష్ నుంచి సినిమా వస్తుందంటే దానికి మినిమం గ్యారంటీ ఉంటుంది. విక్టరీనే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సైంధవ్ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది.
వెంకటేష్ ఆస్తుల విలువ గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. నీరజారెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి జన్మించారు. తన తండ్రి రామానాయుడు ఏర్పాటు చేసిన సురేష్ ప్రొడక్షన్స్ లో తన అన్నతో పాటు వెంకటేష్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

వెంకటేష్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు. రూ.2వేల కోట్లకు పైనే ఆస్తులున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకీ సినిమాకు రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటారు. తన సంపాదన, సురేష్ ప్రొడక్షన్స్ తోపాటు తండ్రి నుంచి వారసత్వంగా కొన్ని ఆస్తులు లభించాయి. వీటన్నింటి విలువ రూ.3వేల కోట్లకు పైనే ఉంటుందని సమాచారం.
సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత సైంధవ్ సినిమాతో సంక్రాంతిని ప్రేక్షకులను పలకరించబోతున్నారు వెంకీ. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించింది. హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. తాజాగా గుంటూరు, విజయవాడలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ ను ఇటీవలే నిర్వహించారు. ఇందులో భాగంగా సిటీ బస్సులో ప్రయాణించడంతోపాటు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులతో చిత్ర బృందం సమావేశమైంది.












Click it and Unblock the Notifications