'డాకు మహారాజ్' రివ్యూ: దబిడి దిబిడే

నందమూరి నటసింహం బాలకృష్ణ దర్శకుడు బాబి కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా 'డాకు మహారాజ్'. సంక్రాంతి కానుకగా ఆదివారం( జనవరి 12)న ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతుల హీరోయిన్లుగా.. బాబీ డియేల్ విలన్‌ పాత్రలో నటించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ నాలుగు గంటల బెనిఫిట్ షోలు పూర్తయ్యాయి. సినిమా ఎలా ఉందో.. సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ:
నానాజీని మదనపల్లి హిల్స్ స్టేషన్‌లో సంపన్న కుటుంబానికి చెందిన యువతిని రక్షించేందుకు నియమిస్తారు. మరోపక్క సీతారాం (బాలకృష్ణ) మరియు అతని భార్య (ప్రగ్యా జైశ్వాల్‌) మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతంలోని నీటిపారుదల ఇంజనీర్లుగా విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ ప్రాంతంలో శక్తివంతమైన ఠాకూర్ కుటుంబం చాలా ఇస్తూ ఉంటారు. వీరు మార్బుల్ మైనింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తారు. ఇక గ్రామస్తులు ఆ ప్రాంతంలో తీవ్రమైన నీటి కొరతతో సతమతమవుతూ ఉంటారు. అలాంటి సమయంలో సీతారాం వారికి అండగా నిలిచి ఉగ్ర మహారాజుగా మారతాడు. అల సీతారాం మరియు ఠాగూర్ కుటుంబానికి మధ్య జరిగే తీవ్ర సంఘర్షణ నేపథ్యంలోనే మిగతా కథ అంతా నడిచింది.

Daku Maharaj Movie Review and rating

విశ్లేషణ
కథలో కొత్తదనం లేకపోవడం.. ఊహించినట్లుగా సినిమా ఉండడం కాస్త సినిమాకు మైనస్ అయినా.. కథ మాత్రం ఆకట్టుకునేలా డిజైన్ చేశాడు దర్శకుడు. అయితే సినిమా మొదటి పదినిమిషాలు కాస్త షేక్ అయినట్లు అనిపించినా.. వెంటనే కథ ఊపందుకుంది . మెల్లమెల్లగా హై గేర్ లోకి మారింది. ఫ్రీ క్లైమాక్స్ వరకు స్టోరీ అదే వేగాన్ని కొనసాగించింది.అయితే క్లైమాక్స్ ఫ్లాట్ గా ఉండడంతో.. అందరూ సస్పెన్స్ ఫీల్ అయ్యేలా చేయడంలో ఫెయిల్ అయినట్లు అనిపించింది. దర్శకుడు బాబీ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అతను ఆడియన్స్‌ను సీట్ ఎడ్జ్ లోకి తీసుకురావడంలో, ఆడియన్స్ కు విషువల్ ట్రీట్ ఇవ్వడంలో సక్సెస్ సాధించాడు. స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నప్పటికీ.. ఇంకా కథను మరింత క్రియేటివ్‌గా బాబి రాసిఉండొచ్చు అనిపించింది.

ఫర్మామెన్స్
బాలకృష్ణ నానాజీ, ఇటు డాకు మహారాజ్ పాత్రలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పించాడు.బాబి డియోల్ ఠాగూర్ రోల్‌లో స్టైలిష్ గా.. అలాగే పవర్ఫుల్ గా కనిపించాడు. ఇక ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ సెకండ్ హాఫ్ లో చిన్న పాత్రలైనా కీలకపాత్రలో మెప్పించారు.

టెక్నికల్:
సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గలేదు. ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నాగ వంశీ రూపొందించినట్లు సినిమా చూసే ఆడియోస్ కు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక విజయ్ కణ్ణన్‌ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది. అఖండ వారసత్వాని.. మరోసారి బాలయ్య తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సినిమాకు సెకండ్ హీరో ఎవరైన ఉంటే అది కచ్చింతంగా థమన్ అనే చెప్పాలి.

ప్లస్‌లు:
బాలయ్య రెండు పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ నటించడం సినిమాకు ప్లస్. ఇక స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్, సినిమా విజువల్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా కలిసొచ్చే అంశాలు.

మైనస్‌లు:
కథ ఊహించదగినట్లుగా రూపొందించడం, క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు సినిమాకు మైనస్ పాయింట్. సెంకడాఫ్‌ కొంచెం స్లోగా ఉండటం.

ముగింపు:
క్లైమాక్స్ ఆడియన్స్‌ను నిరాశ పరుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+