రాత్రికి రమ్మని అడుగుతున్నాడు..స్టార్ హీరో కూతురు షాకింగ్ కామెంట్స్

ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.

కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించారు. ఇక హేమ కమిషన్ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలో బాధితులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, వేధింపుల కథనాలు విని షాక్ అయ్యామని హేమ కమిషన్ నివేదికలో పేర్కొంది. తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి కామెంట్స్ చేసింది.

dangal beauty fatima sana shaikh talk about casting couch

ఫాతిమా సనా షేక్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 'దంగల్' సినిమాలో ఆమిర్ ఖాన్ కూతురుగా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా ఈ భామ కాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించింది. ఓ తెలుగు నిర్మాతను కలిసినప్పుడు ఆయన నాతో ప్రవర్తించిన తీరు విచిత్రంగా ఉందని ఫాతిమా సనా షేక్ చెప్పుకొచ్చింది. 'మీకు అవకాశం కావాలంటే ప్రతి పనిని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏది చేయడానికైనా అంగీకరించాలి' అన్నారు. రాత్రికి రమ్మని నేరుగా అడుగుతారు అంటూ ఆ నిర్మాత కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. సినిమాలో తాను ఏం చేయడానికి అయిన సిద్ధంగా ఉన్నానని.. కానీ ఇలాంటి పనులు చేయనని చెప్పి అక్కడి నుంచి వచ్చేశానని ఈ భామ తెలిపింది. ఫాతిమా ప్రస్తుతం తెలుగులో నటించింది. 'నువ్వు నేను ఒకటవుదాం' అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+