ఓటీటీని షేక్ చేస్తున్న బోల్డ్ మూవీ ఇదే.. ఇప్పుడే చూసేయండి..!
సాధారణంగా తెలుగు సినిమాల్లో రొమాన్స్, థ్రిల్లర్ మూవీస్ తక్కువగా ఉంటాయి. అయితే హాలీవుడ్ అందుకు పూర్తిగా భిన్నం.. హాలీవుడ్ సినిమాల్లో రొమాన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్, అదిరిపోయే క్లైమాక్స్ ఇలా అన్నీ ఉంటాయి. అక్కడ బోల్డ్ సినిమాలు చాలానే రిలీజ్ అవుతుంటాయి. అలాంటి ఓ బోల్డ్ మూవీనే 'డీప్ వాటర్'.. ఈ హాలీవుడ్ ఇంగ్లీష్ మూవీ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది.
'డీప్ వాటర్' మూవీ రన్ టైమ్ 1 గంట 55 నిమిషాలు ఉంటుంది. ఈ మూవీని ఆడ్రియన్ లైన్ తెరకెక్కించాడు. ఫేటల్ అట్రాక్షన్, అన్ ఫెయిత్ ఫుల్ లాంటి సెన్సేషనల్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఆడ్రియన్ లైన్. అయితే ఆయన దాదాపు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ డీప్ వాటర్ మూవీని 1957 నాటి ఓ నవల ఆధారంగా తీసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ మూవీలో బెన్ అఫ్లెక్, అనా డి అర్మాస్ లీడ్ రోల్స్ లో ఆకట్టుకున్నారు. అయితే విశేషం ఏంటంటే..? ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తర్వాత కొన్నాళ్లు సహజీవనం చేసి విడిపోయారు. ఇక డీప్ వాటర్ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఈ మూవీ విక్, మెలిండా అనే భార్యాభర్తల చుట్టూ తిరుగుతుంది.

మెలిండా మరో వ్యక్తితో అఫైర్ పెట్టుకుంటుంది. ఈ విషయం తెలిసినా భర్త విక్ సైలెంట్‌గా ఉంటాడు. ఆమెపై ఉన్న ప్రేమ, గట్టిగా నిలదీస్తే ఎక్కడ వెళ్లిపోతుందనే భయంతో మెలిండాను ఏమీ అనకుండా ఉంటాడు. దీంతో తర్వాత ఏం జరగబోతుంది..? అనే ఉత్కంఠ చివరి వరకూ ఆడియన్స్ కు కలుగుతుంది. తన భార్యతో సంబంధం ఉన్న వ్యక్తిని విక్ టార్గెట్ చేస్తాడు. అయితే గతంలో మెలిండాను ప్రేమించిన ప్రతి ఒక్కరినీ చంపేశానని, నీకు కూడా అదే గతి పడుతుందని వార్నింగ్ ఇస్తాడు. గతంలో విక్ ఏం చేశాడు..? ఆ తర్వాత ఏం జరుగుతుంది..? అనే విషయం తెలియాలంటే మూవీ చివరి వరకు చూడాల్సిందే..












Click it and Unblock the Notifications