'పుష్ప2': అల్లు అర్జున్‌ అరెస్ట్? సెక్షన్లు ఏం చెబుతున్నాయి?

డిసెంబరు నాలుగోతేదీ రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ట్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా బెనిఫిట్ షో వేశారు. అక్కడకు బన్నీ రావడంతో తోపులాట జరిగి దిల్ షుక్ నగర్ కు చెందిన రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మరణించారు. ఆమె తొమ్మిది సంవత్సరాల కుమారుడు దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఈ బాబు ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నాడు. ఈ దుర్ఘటనపై చిక్కడపల్లి పోలీసులు వివిధ సెక్షన్ల కింద అల్లు అర్జున్, పుష్ప2 టీం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది. ఏయే సెక్షన్లు నమోదు చేశారు? వాటికి ఏవిధంగా శిక్ష పడుతుంది అనే వివరాలను తెలుసుకుందాం.

సంధ్య థియేటర్ కు వస్తున్నాననే విషయాన్ని ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమనేది అల్లు అర్జున్ చేసిన అతి పెద్ద తప్పు. కేసులను ఒకసారి పరిశీలిస్తే.. భారత న్యాయ సంహిత ప్రకారం నమోదయ్యాయి. బీఎన్ఎస్ 105, 118(1) r/w 3(5) సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

Details of the sections in the case registered against Allu Arjun

సెక్షన్ 105
ప్రాణ నష్టం కేసు లేదంటే హత్య కింద పరిగణిస్తారని న్యాయ నిపుణులు తెలియజేస్తున్నారు. హత్య చేయాలనే ఉద్దేశం నిందితుడికి లేకపోయినప్పటికీ, ప్రాణం తీయాలనే ఆలోచన లేకపోయినప్పటికీ జరిగిన దుర్ఘటనలో మహిళ ప్రాణం పోయింది కాబట్టి అదే కీలకం అవుతుంది. కాబట్టి నిందితుడే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

సెక్షన్ 118(1)
నేరాన్ని ప్రేరేపించారు అనే అర్థం వస్తుంది. అంతేకాకుండా నేరం జరిగిన తర్వాత దాన్ని దాయడం, అసలు అక్కడ ఏమీ జరగలేదనేలా చేయడానికి ప్రయత్నించడం, జరిగిన దుర్ఘటనను తేలిగ్గా తీసుకోవడం అనే ఉద్దేశాలున్నట్లుగా ఈ సెక్షన్ చెబుతోంది. దీనికింద నిందితుడికి మరణ శిక్ష, యావజ్జీవిత ఖైదు విధించే అవకాశాలుంటాయి. కేసుల తీవ్రతను బట్టి ఇది ఆధారపడివుంటుంది. 3(5) అనేది చట్టవ్యతిరేక పనులకు సంబంధించినది. ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే తీవ్ర నేరంగా భావిస్తారు. దీనికి పడే శిక్షలు కూడా తీవ్రంగానే ఉంటాయి.

శిక్ష ఎంత పడొచ్చు
కేసు దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తాయి. మరణానికి ఎవరు బాధ్యులు అనే విషయాన్ని కోర్టులు నిర్ణయిస్తాయి. న్యాయ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్ష లేదంటే 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని చెబుతున్నారు.

ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జిషీటును కోర్టుకు నివేదించాలి. అప్పుడు కోర్టు తీర్పును బట్టి ఎవరు దోషి, ఎవరు నిర్దోషి అనేది ఆధారపడివుంటుంది. ఇలాంటి కేసులు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాయి. అవి తీర్పులు రాకుండా సంవత్సరాల తరబడి పెండింగ్ లోనే ఉన్నాయి. ఒకవేళ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే మూడు నెలల తర్వాత ఆయనకు బెయిల్ లభించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+