శివ..శివా.. అరుణాచలంలో అపచారం.. స్టార్ హీరోయిన్ పై భక్తులు ఫైర్

దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో అరుణాచలం టాప్ ప్లేస్ లో ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా ఆ క్షేత్రాన్ని దర్శించుకోవాలని భక్తులు ఎదురుచూస్తూంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని కోట్ల మంది భక్తుల భావన. సామాన్య మానవుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమంది ఈ ఆలయాన్ని ఆరాధిస్తుంటారు. అలాంటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంలో ఓ స్టార్ హీరోయిన్ పాడు పని చేశారు. అవును.. నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.

Devotees Furious as Actress Sneha and Husband Circumambulate Arunachala in Sandals

ఎంతో విశేషమైన క్షేత్రంగా అలరారుతున్న అరుణాచలంలో స్టార్ హీరోయిన్ స్నేహ చేయకూడని పని చేశారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న అరుణాచల గిరి ప్రదక్షిణను చెప్పులేసుకుని నడిచారు. భర్త ప్రసన్న కుమార్ తో కలిసి ఆమె చెప్పులతో గిరి ప్రదక్షిణ చేశారు. సూర్యుడు ఉదయించడానికి ముందే ఈ జంట ముఖానికి మాస్కులు ధరించి కాలినడకన గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. దారిలో ఎదురయ్యే ఆలయాల దగ్గర ఆగి కొబ్బరికాయలు కొడుతూ తర్వాత నడక సాగించారు. ఈ క్రమంలో తమకు ఎదురైన హిజ్రాలతో ఫోటోలు కూడా దిగారు.

అయితే అంతా బాగానే ఉన్నా గిరి ప్రదక్షిణను వీళ్లు చెప్పులు, శాండిల్స్ ధరించి నడిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, భక్తులు కాస్తయినా బుద్ధి లేదా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు సైతం స్నేహ దంపతులపై మండిపడుతున్నారు. కాళ్లకు చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేయడమేంటి..? కొంచమైనా బుద్ధి లేదా..? ఇది మహాపాపం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Take a Poll

ఇక స్నేహ తెలుగులో చాలా హిట్ సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళంలో టాప్‌ హీరోయిన్‌గా రాణించారు. ప్రియమైన నీకు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె హనుమాన్‌ జంక్షన్‌, వెంకీ, శ్రీరామదాసు, రాధాగోపాలం, పాండురంగడు, అమరావతి, రాజన్న, సన్నాఫ్‌ సత్యమూర్తి, వినయ విధేయ రామ.. తదితర చిత్రాల్లో నటించారు. స్నేహ ప్రసన్నకుమార్‌తో ప్రేమలో పడ్డారు. అనంతరం వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+