OM Movie First Review: ధనుష్ 'ఓం' మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. హిట్స్ ప్లాఫ్స్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. గతేడాది తెలుగులో కుబేర సినిమాతో అలరించారు ధనుష్. ఈ చిత్రానికి టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ధనుష్ 'ఓం' అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 20న రిలీజ్ కానుంది. ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో ధనుష్ కు జోడీగా సాయి పల్లవి నటించారు.
అలాగే ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి 'అమరన్' ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. అలాగే యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ స్వరాలు సమకూర్చారు. ఇక వండర్బార్ ఫిల్మ్స్, ఆర్టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మాగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఇటీవల జరిగిన ప్రీ- రిలీజ్ ఈవెంట్ కూడా మంచి సక్సెస్ కావడంతో రిలీజ్ కు ముందే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే పాజిటివ్ వైబ్స్ నెలకున్నాయి. ఇక ఈ మూవీ నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూను తాజాగా ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రదర్శించారని టాక్. అయితే ఈ సినిమాకు సంబంధించిన టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఎర్ర చందనం మాఫియా నేపథ్యంలో కొన్ని యదార్థ సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారని టాక్ వినిపిస్తోంది. ఎర్ర చందనం మాఫియాను బ్రేక్ చేయడానికి పోలీసులు హీరోను ముమ్ముట్టి గ్యాంగ్ లోకి ఒక స్పై గా చేరతాడు. అక్కడ జరిగే సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేస్తూ ఉంటాడు ధనుష్. అయితే ఇదే సమయంలో పోలీసులు అమాయకులైన కూలీలను ఎన్ కౌంటర్ లో కాల్చి వేస్తారని సమాచారం. దాంతో అప్పటివరకూ స్పై గా ఉన్న ధనుష్.. ఆ తర్వాత నిజంగానే ముమ్ముట్టి గ్యాంగ్ లో స్పై గా చేరిపోతాడని తెలుస్తోంది. ఆ తర్వాత జరిగే పరిణామాలే సినిమా స్టోరీ అని తెలుస్తోంది. ఇక మొత్తానికి ధనుష్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయంగా మాట్లాడుకుంటున్నారు. మరి ఫుల్ రివ్యూ కోసం నవంబర్ 20 వరకు ఆగాల్సిందే..












Click it and Unblock the Notifications
