‘పుష్ప2’ రికార్డును బద్ధలు కొట్టిన ‘దురంధర్’
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన 'దురంధర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ దూసుకుపోతూనే ఉంది. 2025 డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా, కేవలం వసూళ్లతోనే కాకుండా.. సరికొత్త రికార్డులతో భారతీయ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2025 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం, ఇప్పుడు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ తన ఆధిపత్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా చాటుతోంది.
59 రోజుల ఆల్ టైం రికార్డు
సాధారణంగా ఏ సినిమా అయినా విడుదలైన కొన్ని వారాలకే ట్రెండింగ్ నుండి తప్పుకుంటుంది. కానీ, ఆదిత్య ధార్ దర్శకత్వ ప్రతిభ, రణవీర్ నటన తోడై 'దురంధర్' ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ 'బుక్ మై షో'లో అత్యధిక రోజులు ట్రెండింగ్‌లో ఉన్న చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఏకంగా 59 రోజుల పాటు ట్రెండింగ్‌లో నిలిచి భారతీయ చిత్ర పరిశ్రమలో మరే సినిమాకూ సాధ్యం కాని 'ఆల్‌టైమ్ రికార్డ్'ను తన ఖాతాలో వేసుకుంది.

ఆధిపత్యాన్ని చాటుకుంటున్న బాలీవుడ్
ఈ క్రమంలో 'దురంధర్' పలు భారీ చిత్రాలను వెనక్కి నెట్టింది. దురంధర్ 59 రోజులు, ఛావా 58 రోజులు, స్త్రీ-2 57 రోజులు, పుష్ప-2 53 రోజులు, ప్రేమలు 53 రోజులు, మంజుమ్మెల్ బాయ్స్ 50 రోజులు, కల్కి 49 రోజులు, జవాన్ 48 రోజులు, లోకా చాప్టర్ 1 46 రోజులు, మహావతార నరసింహా 42 రోజులు ట్రెండింగ్ లో నిలిచాయి. దురంధర్ లో రణవీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి భారీ తారాగణం ఉండటం కూడా ఈ సినిమాకు బాగా కలిసివచ్చింది. ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తున్న ఈ మూవీకి సీక్వెల్ సిద్ధమైంది. 'దురంధర్ ది రివెంజ్' పేరుతో రానున్న పార్ట్-2, మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సీక్వెల్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి! కొన్నాళ్లుగా బాలీవుడ్ పై టాలీవుడ్ ఆధిపత్యం వహిస్తుండటంతో ఏ సినిమా చేయాలనే డైలమాలో పడిపోయిన రణ్ వీర్ ఎట్టకేలకు దురంధర్ తో అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. రాబోయే రోజుల్లో దురంధర్2 కూడా భారీ హిట్ అయితే టాలీవుడ్ ఆధిపత్యం తగ్గి బాలీవుడ్ ఆధిపత్యమే కొనసాగే అవకాశం ఉంది. మరి మన తెలుగు హీరోలు, దర్శకులు ఏం చేస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications