'బాహుబలి 2' రికార్డును బద్దలు కొట్టిన సినిమా ఇదే.. ఓటీటీ డేట్ ఫిక్స్..!
ప్రతి ఏటా చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తుంటాయి. ఇక భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాహుబలి 2 ఓ రికార్డు. ఇప్పటి వరకూ చాలా సినిమాలు ఈ మూవీ రికార్డుల్ని అధిగమించాలని చూసినా అది సాధ్యం కాలేదు. అయితే తాజాగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్.. ఈ రికార్డుల్ని దాటేసింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ. 1300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
నార్త్ అమెరికాలో బాహుబలి 2 రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అయితే తాజాగా ధురంధర్ మూవీ ఈ రికార్డుల్ని అధిగమించింది. ఈ మూవీ నార్త్ అమెరికాలో 21 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇప్పుడు బాహుబలి 2 ను దాటేసి ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చిందీ మూవీ. రెండో స్థానంలో బాహుబలి 2 ఉంది. ఇక మూడో స్థానంలో కల్కి 2989ఏడీ చిత్రం ఉంది. నాలుగో స్థానంలో పఠాన్, ఐదో స్థానంలో జవాన్ ఉంది.
అలాగే భారత్ లోనూ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగానూ ధురంధర్ రికార్డు సృష్టించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే రూ. 800 కోట్లకు పైగా నెట్.. అలాగే రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దాంతో ఇప్పటివరకు విడుదలైన హిందీ సినిమాల్లో అగ్రస్థానంలో నిలిచింది.

మరోవైపు ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడా అని హిందీ కాకుండా మిగతా ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జనవరి 30న నెట్ ఫ్లిక్స్ వేదికగా ధురంధర్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రిలీజ్ కాలేదు.












Click it and Unblock the Notifications