Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'ధురంధర్ 2' టీజర్‌ కు ముహూర్తం ఫిక్స్..!

ఆదిత్య ధర్​ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్​ హీరోగా నటించిన 'ధురంధర్​' మూవీ బాక్సాఫీస్​ వద్ద అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ మూవీకి ఏకంగా రూ.1400 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి. థియేటర్లలో హిందీ భాషలోనే విడుదలైన ధురంధర్.. జనవరి 30 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లోనూ ట్రెండింగ్ అవుతోందీ మూవీ.

ఈ మూవీలో రణ్‌ వీర్‌ సింగ్‌ లుక్స్‌, యాక్టింగ్‌.. అలాగే విలన్‌ గా అక్షయ్‌ ఖన్నా పెర్ఫామెన్స్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నిడివి మూడు గంటలకు పైనే ఉన్నప్పటికీ దీనిని ఆడియెన్స్​ ఎంజాయ్​ చేశారు. అయితే ఈ సినిమాను స్పై థ్రిల్లర్​ గా తెరకెక్కించిన నేపథ్యంలో ఈ మూవీ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మొదటి భాగాన్ని మించి సెకండ్ పార్ట్ మరింత గ్రాండ్‌గా ఉండబోతుందని సమాచారం.

ఇక 'ధురంధర్ 2' టీజర్ మంగళవారం ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఫిబ్రవరి 3 న మధ్యాహ్నం 12:12 గంటలకు టీజర్ రిలీజ్ కానున్నట్లు ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హీరో రణ్‌ వీర్ సింగ్ కూడా ఇదే విషయంపై తన ఇన్‌ స్టా స్టోరీలో ఓ పోస్ట్ చేశాడు.

dhurandhar2 Teaser Locked Ranveer Singh amp amp Aditya Dhar Fix on February 3 Release at 12 12 PM

ఇక ఈ మూవీలో రణ్ వీర్ సింగ్ తో పాటు బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్​ ఖన్నా, ఆర్​ మాధవన్​, అర్జున్​ రాంపాల్​, సంజయ్​ దత్​, సారా అర్జున్, రాకేష్​ బేడీ, మానవ్​ గోహిల్​ తదితరులు ఆయా పాత్రలు పోషించారు. శాశ్వత్​ సచ్​దేవ్​ సంగీతం అందించారు. జియో స్టూడియోస్​, బి62 స్టూడియోస్​ బ్యానర్లపై ఆదిత్య ధర్, లోకేష్​ ధర్​ సంయుక్తంగా నిర్మించారు. ఇక ధురంధర్ 2 మార్చి 19 న విడుదల కానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+