బడా నిర్మాతను పెళ్లిచేసుకోబోతున్న ప్రగతి?
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్లకు మించిన అందంతో, చలాకీతనంతో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది ప్రగతి. నెటిజన్లు ఎన్నిరకాలుగా కామెంట్లు చేసినప్పటికీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోతుంది. అయితే అనవసరంగా తనను విమర్శిస్తే మాత్రం వదిలిపెట్టదు. ఒక్కొక్కరిని చీల్చి చెండాడుతుంది. తాజాగా ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతోందనే వార్త వైరల్ గా మారింది.
ఇప్పటికే ఈమె రెండో వివాహం చేసుకోబోతుందంటూ రకరకాలుగా వార్తలు వచ్చేవి. వీటిపై ఆమె స్పష్టతనిచ్చేది. అయితే మరోసారి ఆమె పెళ్లివార్త వైరల్ గా మారడంతో నిజమే అనుకుంటున్నారు నెటిజన్లు. చాలాకాలం క్రితమే భర్తతో విడిపోయారు. చిన్నవయసులోనే పెళ్లిచేసుకోవడం అనేది తప్పుడు నిర్ణయంగా ఆమె ఎప్పుడూ బాధపడుతుండటుంది.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇంటర్వ్యూలోనే చెప్పింది. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ క్యారెక్టర్ నటిగా, సహాయ నటిగా టాప్ పొజిషన్లో ఉన్న ప్రగతికి ఓ బడా ప్రొడ్యూసర్ రెండో పెళ్లి ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఆ నిర్మాతపై పరిశ్రమలో ఎక్కడా రిమార్క్ లేదు. చాలా పద్ధతిగా పెళ్లి చేసుకుందామని అనడంతో ప్రగతి కూడా అతనిపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో చాలామంది రెండో పెళ్లి చేసుకొని జీవితంలో సెటిలైపోతున్నారు. అలాంటిది తాను చేసుకోవడంలో తప్పేంలేదుకదా అనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన గురించి, తన మనస్తత్వం గురించి పరిశ్రమలో అందరికీ తెలుసు కాబట్టి ఆ నిర్మాత తనకు ప్రపోజ్ చేశాడని భావిస్తోంది. మరి వీరి వివాహానికి ముహూర్తం ఎప్పుడు పెడతారో ప్రగతి చెప్పేంతవరకు వేచిచూడాల్సిందే.












Click it and Unblock the Notifications
