'ఐ బొమ్మ'లో రెండు వెబ్ సైట్లు.. సులువుగా డౌన్ లోడ్
రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ కు లేదంటే మల్టీ ప్లెక్స్ కు వెళ్లి సినిమా చూడటానికి ఎవరూ ముందుకు రావడంలేదు. ఒకరు లేదంటే ఇద్దరు స్నేహితులతో వెళుతుంటేనే భారీగా ఖర్చు అవుతోంది. కుటుంబంతో సినిమాకు వెళ్లాలంటే రూ.4వేల వరకు అవుతోంది. ఖర్చులకు భయపడి ప్రజలు సినిమాలకు వెళ్లడం మాని ఓటీటీలకు అలవాటుపడ్డారు. చూస్తున్నారు కదా అని ఓటీటీలు కూడా ధరలు పెంచేస్తున్నాయి. దీంతో అందరూ ఐబొమ్మ లాంటి థర్డ్ పార్టీ వెబ్ సైట్లను ఆశ్రయిస్తున్నారు.
కొత్త సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లను కూడా ఐబొమ్మ స్ట్రీమింగ్ చేస్తోంది. అయితే గూగుల్ లో ఐబొమ్మకు సంబంధించి చాలా వెబ్ సైట్లు కనపడుతుంటాయి. వీటిల్లో కొన్ని ఫేక్ సైట్లు ఉన్నాయి. మొబైల్ లో సినిమా డౌన్ లోడ్ చేసుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతం ఐబొమ్మకు సంబంధించి రెండు వెబ్ సైట్లు సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఒక సైట్ ఐబొమ్మ కాగా.. రెండోది ఐబొమ్మ వన్. వీటిమధ్య ఉన్న తేడాలను తెలుసుకుందాం.

గూగుల్‌లో ఐబొమ్మ అని టైప్ చేయగానే Ibomma one వస్తుంది. దీనిద్వారా అందరూ కొత్త సినిమాలను చూస్తున్నారు. ఐ బొమ్మ వన్ వెబ్‌సైట్‌లో కొత్త ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. పాత మోడల్ ఐ బొమ్మలో మాత్రం కొన్ని ఆప్షన్స్‌తో సినిమాలు స్ట్రీమ్ అవుతున్నాయి. ఐ బొమ్మ వన్ వెబ్‌సైట్‌లో సినిమాలను సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సినిమాలు చూసేవారికి మధ్యలో ఎటువంటి ప్రకటనలు రాకుండా నోటిఫికేషన్లు కూడా ఆఫ్ చేసింది. సాధారణ ఐబొమ్మలో సినిమాలు డౌన్ లోడ్ చేసుకోవడం కష్టం. వెబ్ సైట్ లో సినిమాలు చూసేవారికి మధ్యలో ప్రకటనలు వస్తుంటాయి. దీనివల్ల సినిమా చూడటానికి అంతరాయం కలుగుతుంది. ఐబొమ్మ వెబ్ సైట్ కు వెళ్లినప్పుడు ఈ తేడాలను తెలుసుకుంటే ఎటువంటి అవాంతరాలు లేకుండా సినిమాలు చూసేయొచ్చు.












Click it and Unblock the Notifications