పవన్‌ కల్యాణ్, అల్లు అర్జున్ మధ్య మరోసారి బయటపడ్డ విభేదాలు

ప్రస్తుతం మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ మధ్య విభేదాలు నడుస్తున్నాయనే విషయం తెలిసిందే. పిఠాపురం నుంచి పోటీచేస్తున్న తన చిన మామయ్య పవన్ కల్యాణ్ కు కేవలం ట్వీట్ ద్వారా మద్దతు తెలియజేసిన అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ తరఫున పోటీచేస్తున్న తన స్నేహితుడు కిషోర్ రెడ్డికి మద్దతు తెలపడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించి చిన్న ర్యాలీ కూడా చేశారు. ఎన్నికల ఫలితాల్లో పవన్ ఘనవిజయం సాధించిన తర్వాత కూడా బన్నీ కేవలం ట్వీట్ తో సరిపెట్టాడు. మెగా కుటుంబంలో జరిగిన విజయోత్సవ వేడులకు కూడా అల్లు అర్జున్ హాజరుకాలేదు. పిలుపు రాలేదని కొందరు చెబుతుంటారు.

వైరల్ అయిన పవన్ పాట
పవన్ కల్యాణ్ అభిమానుల ధాటికి తన పుష్ప2 సినిమాను డిసెంబరుకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా, ఐదు శాఖలకు మంత్రిగా పవన్ కొనసాగుతున్నారు. బ్రదీనాథ్ సినిమాలోని ఓంకారేశ్వరి అనే పాటను కొందరు పవన్ కల్యాణ్ అభిమానులు ఆయన చేసే పనులకు కలుపుతూ ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇది చాలా బాగుందని, పవన్ కల్యాణ్ కు సరిగ్గా సెట్ అయిందంటూ కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియో సాంగ్ వైరలైంది. అయితే తాజాగా అల్లు కాంపౌండ్ లోని అధికారిక పేజీ నుంచి ఓంకారేశ్వరి పాటకు బన్నీ నృత్యం చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

Differences between Pawan Kalyan and Allu Arjun have come out once again

బన్నీపై పవన్ అభిమానుల మండిపాటు
దీనిపై పవన్ అభిమానులు అగ్రహోదగ్రులవుతున్నారు. పవన్ కల్యాణ్ కోసం ఎడిట్ చేసిన పాట తమ ఒరిజినల్ పాట అని, మీరు వాడుకుంటున్నారంటూ అర్థం వచ్చేలా దీన్ని పోస్ట్ చేయించారని మండిపడుతున్నారు. అల్లు అర్జున్ పై, అతని సోషల్ మీడియా టీంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

అంతేకాకుండా ఎన్నికలకు రెండురోజుల ముందు యాత్ర2 సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చూపిస్తూ ఆహాలో ఈ సినిమా చూడండంటూ బాగా ప్రచారం చేశారు. దీనిపై కూడా మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఎన్నికలకు రెండురోజులు ముందు దీన్ని చూపిస్తూ సినిమా చూడండి అంటే అర్థం ఏమిటని, వైసీపీకి ఓటు వేయమనే అర్థం వచ్చేలా ఇలా చేశారంటున్నారు. ఇప్పట్లో ఈ విభేదాలు చల్లారేలా కూడా కనపడటంలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+