రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' కు భారీ ఎదురుదెబ్బ..?
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా,జనవరి 10న విడుదల కానుంది. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలు పెద్దగా ఆకట్టుకున్నట్టు అనిపించడం లేదు. విదేశాల్లో ఆన్‌లైన్ బుకింగ్స్ సైతం అనుకున్నంత స్థాయిలో లేవని తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా మరో సంక్షోభాన్ని ఎదుర్కొనబోతుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రీమియర్స్ సమయంలో ఓ మహిళ మరణించడంతో పాటు ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై ఎఫైర్ నమోదు కావడంతో చిక్కడపల్లి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ వివాదం ఇప్పుడు పెద్దగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ సాక్షిగా తెలుగు ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు.

తాను సీఎంగా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్స్‌కు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని అనుమతి ఇవ్వబోనని తేల్చిచెప్పారు. ఇది నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద షాకే అని చెప్పాలి. ముఖ్యంగా సంక్రాంతికి విడుదల కాబోతున్న 'గేమ్ ఛేంజర్'పై దీని ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం 'గేమ్ ఛేంజర్'కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ 'గేమ్ ఛేంజర్' కు ప్రీమియర్స్‌కు, టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకపోతే, అది కచ్చింతంగా సినిమా పెద్ద లాస్ అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. మరి ఈ గండాన్ని దిల్ రాజు ఎదుర్కొంటారో చూడాలి. ఇక 'గేమ్ ఛేంజర్' విషయానికి వస్తే మూడు రామ్ చరణ్ విభిన్న పాత్రల్లో కనిపించారు.శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ కనిపించబోతున్నారని టీజర్ చూస్తుంటే అర్థం అవుతోంది. శంకర్ దర్శకత్వంలో మూవీ అనేసరికి భారీ హైప్స్ నెలకొన్నాయి. అయితే ఇటీవల ఆయన తీసిన భారతీయుడు 2 డిజప్పాయింట్ చేసిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్ ఎలా ఉంటుందనే డౌట్ మెగా అభిమానుల్లో ఉంది.
కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'గేమ్ ఛేంజర్' అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ గత చిత్రం 'ఆచార్య' ఫెయిల్ కావడంతో , 'గేమ్ ఛేంజర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'గేమ్ ఛేంజర్' సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కూడా మార్చేస్తాడని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications