జూనియర్ ఎన్టీఆర్‌ను దిల్ రాజు 'నాన్న' అని పిలుస్తాడు!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆదితో దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా మారారు. ఆ తర్వాత పరిశ్రమలోకి వచ్చి దిల్ సినిమాతో నిర్మాతయ్యారు. చివరకు తనపేరు కాస్త దిల్ రాజు అయింది. ఆది సినిమా చేసే సమయంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటివారంతా జూనియర్ ఎన్టీఆర్ ను నాన్న నాన్న అని పిలిచేవారు. వయసు చాలా తక్కువ కాబట్టి గారాబంగా పిలిచేవారు. అది చూసి దిల్ రాజు కూడా తారక్ ను ఆది సినిమా సమయం నుంచే నాన్న అని పిలవడం అలవాటు చేసుకున్నారు. ఆరోజు నుంచి ఈరోజు వరకు దిల్ రాజు తారక్ ను నాన్న అనే పిలుస్తారు. అయితే తారక్ మాత్రం దిల్ రాజును అన్నా అని పిలుస్తారు. ఇలా వీరిద్దరి మధ్య అనుబంధం బలపడింది.
పోరాట ఘట్టాలు ఒళ్లు గగుర్పొడిచేలా..
తన కెరీర్ లో తారక్ దిల్ రాజుకు రెండు సినిమాలు చేశారు. బృందావనం, రామయ్యా వస్తావయ్య.. అయితే బృందావనం సూపర్ హిట్ అవగా, రామయ్యా వస్తావయ్యా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి విడుదల కాబోతోంది. ఈ సినిమాకు ముందు హృతిక్ రోషన్ తో కలిసి మల్టీస్టారర్ వార్2 చేశాడు. ఇందులోని పోరాట ఘట్టాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని, కావాలంటే బెట్ కాస్తానంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వార్2, డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. వాస్తవానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.

ప్రాజెక్టు వాయిదా పడటంతో..
అయితే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయాల్సిన ప్రాజెక్టు వాయిదా పడటంతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను ఎంచుకున్నారు. మైథలాజికల్ కథాంశంతో సుబ్రహ్మణ్యస్వామి హీరోగా సినిమా రాబోతోందని అంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ జోనర్ మొదటిసారి చేస్తున్నారు. ఎన్టీఆర్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమా ఇదే. మధ్యలో ఒకసారి వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉందికానీ కుదర్లేదు. అల్లు అర్జున్ పుష్ప2 తర్వాత అట్లీతో సినిమా చేస్తుండటంతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను ఎంచుకున్నారు.












Click it and Unblock the Notifications