రామ్ చరణ్‌తో సినిమా నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు

ఒకే ఒక్క సినిమా దిల్ రాజును ఆకాశం నుంచి పాతాళానికి పడేలా చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, తమిళ స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'గేమ్ ఛేంజర్‌' సినిమాను దిల్ రాజు భారీగా నిర్మించారు. సుమారు రూ.450 కోట్ల రూపాయిలతో భారీ బడ్జెట్‌తో 'గేమ్ ఛేంజర్‌'ను నిర్మించడం జరిగింది. అయితే ఈ సినిమా మొదటి నుంచి కూడా ప్రేక్షకుల్లో అనుకున్నంత బజ్‌ను క్రియేట్ చేయలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. 'గేమ్ ఛేంజర్‌' బాక్సాఫీస్ వద్ద రూ. 129.01 వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

దీని ఫలితంగానే "గేమ్ ఛేంజర్" బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవి చూసింది. ఎంత తీసేసిన ఈ సినిమా రూ.250 కోట్లకు పైగానే నష్టాలను మిగిల్చినట్టు తెలుస్తోంది. వెంటకేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా లేకపోతే దిల్ రాజు పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. "గేమ్ ఛేంజర్" ఫ్లాప్ కావడంతో దిల్ రాజు తీవ్రంగా నష్టపోయారు.

Dil Raju sensational comments on the slope of Game Changer

తాజాగా గేమ్ ఛేంజర్ ఫ్లాప్‌పై దిల్ రాజు మరోసారి స్పందించారు. గేమ్ ఛేంజర్ సినిమా నా జీవితంలో తీసుకున్న అతి పెద్ద తప్పని దిల్ రాజు తెలిపారు. నాలుగున్నర గంటల నిడివితో సినిమాను రూపొందించడంపై నిర్మాత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద దర్శకుడితో పనిచేసినప్పుడు ఎక్కువగా జోక్యం చేసుకోలేకపోవడం, తప్పు జరుగుతున్నప్పుడు దానిని ఆపలేకపోవడం తన మొదటి పొరపాటని ఆయన అంగీకరించారు. "అలాంటి ప్రాజెక్ట్‌ను నేను చేసి ఉండకూడదు" అని ఆయన అన్నారు.

నా కెరీర్‌లో 60 వరకు సినిమాలు తీశాను. కానీ ఎప్పుడూ ఇలా జరగలేదని దిల్ రాజు పేర్కొన్నారు. పెద్ద దర్శకుడితో పనిచేసేటప్పుడు ముందే కాంట్రాక్ట్‌లో స్పష్టమైన పాయింట్లు పెట్టుకొని సినిమా ప్రారంభించాలని, తాను అలా చేయలేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. "అది నేను చేసిన తప్పు. అందుకే దానిని అక్కడితో వదిలేశాను. దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వేస్ట్ అనిపించింది" అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+