దిల్ రాజు భార్య డ్యాన్స్ చూశారా.. హీరోయిన్లు కూడా సరిపోరు మాస్టారూ..!
తెలుగు సినీ పరిశ్రమలో ఒక పేరు, ఒక బ్రాండ్, ఒక పవర్ హౌస్... ఆయనే నిర్మాత దిల్ రాజు. ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్‌గా సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన విజనరీ. కేవలం సినిమాలు తీయడమే కాదు, మంచి కథలను నమ్మి, నూతన దర్శకులను ప్రోత్సహించి, తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఘనత ఆయనది.
'దిల్', 'ఆర్య', 'బొమ్మరిల్లు', 'శతమానం భవతి', 'ఫిదా' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా, విభిన్న కథాంశాలతో ప్రయోగాలు చేయడంలో దిల్ రాజు ఎప్పుడూ ముందుంటారు. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న ఆయన, ఇటీవల తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్‌గా కూడా నియమితులయ్యారు. సినిమా పట్ల అపారమైన అభిరుచి, వ్యాపార దక్షత కలగలిసిన దిల్ రాజు, తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

ఇక దిల్ రాజు జీవితంలో ఒక అకస్మాత్తుగా, అందమైన మలుపుగా ఆయన రెండో వివాహం నిలిచింది. తన మొదటి భార్య అనితను 2017లో కోల్పోయిన తర్వాత, దిల్ రాజు జీవితంలో ఒక శూన్యం ఏర్పడింది. అయితే, విధి అదృష్టవశాత్తు ఆయనను తేజస్వినితో కలిపింది. ఆమె ప్రస్తుతం వైఘా రెడ్డిగా పేరు మార్చుకున్నారు.
వైఘా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతో పాటు, లేటెస్ట్ ఫొటోలను సైతం తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా వైఘా రెడ్డి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ డ్యాన్స్ చూసిన నెటిజన్లు.. హీరోయిన్లు కూడా సరిపోరంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను ఒకసారి చూసేయండి.












Click it and Unblock the Notifications