లవర్ ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకున్న అనిల్ రావిపూడి..ఇక్కడే అసలు ట్విస్ట్
అనిల్ రావిపూడి తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. తన సినిమాల్లోని కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్సెస్ మరియు మంచి కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదివిన అనిల్, తనకున్న సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలోకి అడుగు పెట్టారు. తొలుత రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, 'కందిరీగ', 'మసాలా', 'ఆగడు' వంటి సినిమాలకు రచనలు చేశారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి, 'పటాస్' సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించారు.
ఆ తర్వాత 'సుప్రీం', 'రాజా ది గ్రేట్', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సినిమాలు కూడా భారీ విజయాలు సాధించాయి. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. తాజాగా వెంకటేష్ హీరోగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు కూడా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి సినిమాల్లోని కామెడీ టైమింగ్ ప్రత్యేక ఆకర్షణ. ఆయన సినిమాల్లోని హాస్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి భార్గవి అనే ప్రేమ వివాహం చేసుకున్నారు.

అయితే ఆయన పెళ్లిలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. అనిల్ రావిపూడి పెళ్లిలో ఉన్నన్ని ట్విస్టులు సినిమాలో కూడా ఉండవు. అనిల్ రావిపూడి చదువుకొనే రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అనిల్ రావిపూడిని ప్రేమించింది. అయితే ఆ అమ్మాయి అనిల్ రావిపూడిని మోసం చేసి వేరే అబ్బాయిని వివాహం చేసుకుని వెళ్లిపోయింది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్లిపోవడంతో అనిల్ రావిపూడి కృంగిపోయారు. సరిగ్గా ఇదే సమయంలో అనిల్ రావిపూడి ప్రేమించిన అమ్మాయి ఫ్రెండ్ వచ్చి , నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. మనం పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేసింది. వెంటనే ఆ అమ్మాయికి ప్రపోజల్‌కు ఓకే చెప్పిన అనిల్ రావిపూడి, ఆమెను వివాహం చేసుకున్నారు. నేను నా భార్య ఫ్రెండ్ కు సైట్ కొడితే నా భార్య పడిందని నవ్వుతూ అనిల్ రావిపూడి ఓ ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు అన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications