ఆ హీరోయిన్ సరికాదు: అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు
విక్టరీ వెంకటేష్ నుంచి సినిమా వచ్చి చాలాకాలం అవుతోంది. సైంధవ్ తో పలకరించినప్పటికీ ఆ సినిమా తీవ్ర నిరాశ పరిచింది. తాజాగా తనదైన శైలిలో సినిమా చేయాలనే ఉద్దేశంతో అనిల్ రావిపూడిని ఎంచుకున్నారు. ఆయన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈనెల 14వ తేదీన విడుదల కాబోతోంది. వెంకీమామకు జోడీగా ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. భీమ్స్ స్వరాలందించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను నిజామాబాద్ లో విడుదల చేశారు.
వెంకీ కెరీర్ మొత్తం ఒక ఎత్తు.. ఈ సినిమా మరో ఎత్తు
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించిన హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి అద్భుతంగా నటించారని కొనియాడారు. ఐశ్వర్య తనను చాలా టార్చర్ పెట్టిందని, అది సరికాదని, తాను చాలా ఒత్తిడిలో పడ్డానని, ఇంగ్లిషులో మాట్లాడితే షార్ట్స్ పడుతూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. పోలీసు అధికారిగా, వెంకటేష్ మాజీ లవర్ గా మీనాక్షి చౌదరి అద్భుతమైన నటనను కనపరిచిందన్నారు. తన నటన అదిరిపోయిందన్నారు. వెంకటేష్ గురించి చెప్పాలంటే సినిమా కోసం తాను ఏదైనా చేసేస్తారన్నారు. విక్టరీ వెంకీ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారని, ఈ సినిమాలో సరికొత్తగా ఆయన పాత్ర ఉండబోతోందని అనిల్ రావిపూడి చెప్పారు.

బాలయ్యకు థియేటర్ల కొరత
దిల్ రాజు నిర్మిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా 14వ తేదీన విడుదల కాబోతోంది. ఇదే నిర్మాత నిర్మించిన మరో చిత్రం గేమ్ ఛేంజర్ 10వ తేదీన విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలతో తిరిగి పూర్వవైభవాన్ని అందుకోవాలని దిల్ రాజు యోచిస్తున్నారు. దీంతోపాటు డాకూ మహారాజ్ సినిమాను కూడా నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు థియేటర్ల కొరత ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. దిల్ రాజు తన రెండు సినిమాలకు మొదటి ప్రాధాన్యతనిస్తారని, కొన్ని థియేటర్లు చేతిలో ఉన్న ఏషియన్ సురేష్ వాళ్లు వెంకీ సినిమాకు ప్రాధాన్యతనిస్తారని, దీంతో బాలయ్యకు థియేటర్ల కొరత తప్పదంటున్నారు.












Click it and Unblock the Notifications