రష్మిక మందన్నాకు ఆ దర్శకుడు వేధింపులు..?
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రష్మిక మందన్నా. ఈ మధ్య శ్రీలీల కాస్తా హడావిడి చేసినప్పటికీ...ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది. ఇక పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్దెకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం రష్మిక మందన్నానే టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.
రష్మిక మందన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. గతేడాది పుప్ప, సీతరామం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక రష్మిక మందన్నా రాబోవు సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప-2తో పాటు నితిన్‌తో మరో సినిమా చేస్తోన్న హాట్ బ్యూటీ బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, విక్కి కౌషల్‌తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.

ఇదిలా ఉంటే రష్మికకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఓ దర్శకుడు ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అది కూడా గతంలో తనుకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు నెంబక్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. మొదట్లో ఆ దర్శకుడుతో బాగానే ఉన్న రష్మిక తరువాత ఏర్పడిన మనస్పర్ధల కారణంగా రష్మిక సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోలింగ్ ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొందట.
దీనికి తోడు ఆ డైరెక్టర్ ఫ్యాన్స్ అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నారట. నోటికి చెప్పలేని విధంగా ఉండే వీడియోస్ పంపిస్తున్నారట. దీంతో ఏం చేయాలో తెలియని రష్మిక సదరు దర్శకుడు నెంబర్‌ను బ్లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. అయితే ఈ వార్తలో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications