"ఐరన్ లెగ్".. అప్పుడు ఆమెలానే.. ఇప్పుడు ఈమెకి కూడా ??

తెలుగు చిత్ర పరిశ్రమలోకి "పెళ్లి సందD" సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది నటి శ్రీలీల. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన గ్లామర్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, డాన్స్ స్కిల్స్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన "ధమాకా" సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి.. ఆమెకు మాస్ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. దాంతో స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.

హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. పుష్ప 2లోని "కిస్సిక్" అనే ఐటమ్ సాంగ్‌లో ఆమె చేసిన స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. మూవీ షూటింగ్ సమయంలో వీరి మధ్య సన్నిహితత పెరగడంతో, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియా హల్‌చల్ చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై శ్రీలీల కానీ కార్తీక్ కానీ స్పందించలేదు. ఇక హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా శ్రీలీల కెరీర్ ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఆమె ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటోంది.

director-harish-shankar-counter-to-trollers-about-sreeleela-iron-leg-issue-on-social-media

ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్..

అయితే గత కొన్నేళ్లుగా సరైన విజయం మాత్రం ఆమెకి దక్కలేదనే చెప్పాలి. ముఖ్యంగా ధమాకా తర్వాత అరడజన్ సినిమాలు చేసినా కూడా ఈమెకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. రీసెంట్ గామె తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీల. దీంతో శ్రీ లీలపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. మార్చి 19వ తేదీన భారీ అంచనాల మధ్య ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో శ్రీ లీల ఐరన్ లెగ్ సెంటిమెంట్ వల్ల ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని కొంతమంది నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలీలకు మద్దతుగా నిలిచారు హరీష్ శంకర్. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న వారికి కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హరీష్ శంకర్ మాట్లాడుతూ..

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా చూస్తున్నాను. చాలామంది శ్రీలీలను ఐరన్ లెగ్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఒకటే చెబుతున్నా.. ఇంతకాలం డాన్స్ చేసే శ్రీలీలను మాత్రమే మీరు చూసి ఉంటారు. ఇందులో డాన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆమె అదరగొట్టేసింది. ఈ సినిమా నుంచి ఆమె ఐరన్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ అవుతుంది అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. కాగా గతంలో హరీష్ - పవన్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అంతకు ముందు కూడా ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేయగా.. ఆ చిత్రం భారీ హిట్ కొట్టడంతో ఆమెను గోల్డెన్ లెగ్ అనడం స్టార్ట్ చేసారు. దాంతో అప్పుడు శృతికి జరిగినట్టే.. ఇప్పుడు శ్రీలీలకి కూడా జరుగుతుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+