స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి నానా తంటాలు పడుతున్న హీరో

సంతానం లేని వారి సంఖ్య రోజు రోజుకు అధికమవుతోంది. ఆహారపు అలవాట్లు, ఉద్యోగ ఒత్తిడి మొదలగు కారణాలతో చాలామంది జంటలకు సంతానం కలుగడం లేదు. మహిళల్లో ఎగ్‌కు సంబంధించిన సమస్య తలెత్తుతోంది. ఇక పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ప్రధాన సమస్యగా మారుతోంది. సాధారణ వీర్యం విశ్లేషణలో స్పెర్మ్ కౌంట్ 20 మిలియన్ల నుండి 200 మిలియన్ల మధ్య ఉండాలి. ఈ ఫలితాన్ని స్పెర్మ్ డెన్సిటీ అని కూడా అంటారు. ఈ సంఖ్య తక్కువగా ఉంటే, గర్భం ధరించడం మరింత కష్టమవుతుంది.

సంతానోత్పత్తిని పెంచడానికి లేదా మీ స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడానికి మార్గాల కోసం చూస్తున్నట్లయితే, మీ ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ఒక మంచి ప్రారంభం. పోషకమైన ఆహారం స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.తాజాగా ఓ హీరో ఈ కథాంశంతో ఏకంగా ఓ సినిమా చేస్తున్నారు. ఏబీసీడీ, అహ నా పెళ్లంట తర్వాత దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ కథతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.దీంతో ఈ ఇష్యూనే దర్శకుడు వినోదాత్మకంగా చూపించనున్నాడు. సంతాన ప్రాప్తిరస్తు అంటూ ఉన్న ఈ మూవీ టైటిల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

director is making a new movie with the story of sperm count

ఈ సినిమాలో హీరోగా విక్రాంత్, హీరోయిన్‌గా చాందినీ చౌదరి నటిస్తున్నారు. తాజాగా హీరో పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్‌తో పాటు, ఫస్ట్ లుక్‌‌ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లొ హీరో చేతిలో స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు ఏం చేయాలి అనే బుక్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, యోగా, వ్యాయామం చేయడానికి మ్యాట్, సిరప్, మెడిసన్స్ కనిపిస్తున్నాయి. దీని బట్టి చూస్తే హీరో స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+