ఎన్టీఆర్ చేయాల్సిన ఫ్లాప్ సినిమా అల్లు అర్జున్ చేశాడు!

తెలుగు సినీ పరిశ్రమలో రోజురోజుకు పాన్ ఇండియా సినిమాలు పెరుగుతున్నాయి. లోబడ్జెట్ నుంచి మీడియం బడ్జెట్, హై బడ్జెట్ చిత్రాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కతున్నాయి. అలాగే హీరోలు కూడా పాన్ ఇండియా హీరోలుగా మారిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవగా, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయ్యారు. పరిశ్రమలో వీరిద్దరూ ఎంతో స్నేహంగా ఉంటారు. ఇద్దరూ బావా.. బావా.. అని పిలుచుకుంటారు. ఎప్పుడు ఏ సినిమాలు చేస్తుంది? వాటి అప్ డేట్.. కథలు, దర్శకులు.. ఇలా ప్రతి విషయాన్ని చర్చించుకుంటుంటారు.

గతంలో కొన్ని సందర్భాల్లో అల్లు అర్జున్ చేయాల్సిన సినిమాలు తారక్ చేశారు. అలాగే తారక్ చేయాల్సినవి అల్లు అర్జున్ చేశాడు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ కూడా మొదటగా తారక్ చేయాల్సి ఉంది.

director krish movie vedam first offered to junior ntr

అయితే ఎందుకనో ఎన్టీఆర్ తిరస్కరించాడు. అయితే అల్లు అర్జున్ మాత్రం సినిమా ఫ్లాపవుతుందని తెలిసినప్పటికీ వేదం చేశాడు. మంచు మనోజ్, అనుష్క.. తదితరులు నటించారు. బాక్సాఫీస్ పరంగా పెద్దగా మెప్పించకపోయినప్పటికీ కథ పరంగా, దర్శకత్వ ప్రతిభ పరంగా మాత్రం ఈ సినిమాను అందరూ మెచ్చుకున్నారు. అల్లు అర్జున్ క్యారెక్టర్ కు బాగా పేరు వచ్చింది.

వాస్తవానికి తాను చేస్తే ఈ పాత్ర అభిమానులకు నచ్చదేమోననే సందేహంతో తారక్ తిరస్కరించాడు. అలా ఎన్టీఆర్ ఖాతాలో ఫ్లాప్ పడాల్సిన సినిమాను అల్లు అర్జున్ తన ఖాతాలో వేసుకున్నాడంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కథలను ఎంచుకునే విషయంలో అల్లు అర్జున్ కు మంచి పేరుంది. దాదాపుగా అతను కథ ఎంచుకుంటే సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే టాక్ ఉంది. అటువంటిది తమ హీరో ఈ సినిమా విషయంలో తప్పు చేశాడని బన్నీ అభిమానులు వాపోతుంటారు. అయితే మరికొందరు మాత్రం సినిమా ఫ్లాపవుతుందని తెలిసినా క్యారెక్టర్ బాగుండటంతో వదులుకోవడం ఇష్టంలేక బన్నీ చేశాడని చెబుతుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+