చరిత్రలో మొదటిసారిగా ఆ హీరోయిన్ ను బతిమలాడుతున్న రాజమౌళి!
రాజమౌళి.. ప్రస్తుతం ఈ పేరు తెలుగు సినీరంగం కాదు.. దేశ సినీరంగం కాదు.. అంతర్జాతీయ సినీరంగానికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా పాపులరైన భారతీయ దర్శకుడు ఎవరు అంటే దర్శక ధీరుడు రాజమౌళి అని అందరూ చెప్పేస్తున్నారు. తన ప్రతిభతో తెలుగు సినిమాను అంతర్జాతీయ ఖ్యాతికి చేర్చిన గొప్ప దర్శకుడు, అటువంటి దర్శకుడి సినిమాలో నటించడానికి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసేవారున్నారు.. తమకు కూడా అవకాశం ఉంటుందా? అని స్టార్ హీరోలు అడుగుతుంటారు. అటువంటి దర్శకుడు ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు.
అలియా పాత్రను కుదించారు
యాక్షన్, అడ్వెంచర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న స్టార్లను ఈ సినిమాలో రాజమౌళి భాగస్వాములను చేయబోతున్నారు. ఓ ముఖ్యమైన పాత్ర కోసం అలియాభట్ ను ఎంపిక చేసుకుందామని దర్శక ధీరుడు భావించారు. రాజమౌళి అడిగితే అలియా భట్ నో చెప్పింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను ఎడిట్ చేసే క్రమంలో రాజమౌళి ఆమె పాత్రను బాగా కుదించాల్సి వచ్చింది. ఇది అలియాకు ఏమాత్రం నచ్చలేదు.

కేవలం పది నిముషాలున్నా..
సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ విజయాన్ని ఎంజాయ్ చేయలేకపోయానని, కేవలం పది నిముషాలున్నానంటూ బాధపడింది. అందుకే ఇప్పుడు రాజమౌళి అడుగుతున్నా నో చెబుతోంది. కానీ అలియా అయితేనే ఆ క్యారెక్టర్ బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నారు. ఇప్పుడే కాదు ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత వీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నా దీనిమీదే టాపిక్ నడుస్తుందని చెబుతుంటారు. చివరకు రాజమౌళి లాంటి దర్శకుడు అడుగుతున్న అలియా మాత్రం ససేమిరా అంటోంది. మరోసారి బతిమలాడుతారో లేదంటే వేరే ఎవరినైనా ఎంపిక చేసుకుంటారేమో చూడాలి.












Click it and Unblock the Notifications