#BOYCOTT భైరవం.. మెగా ఫ్యాన్స్ దెబ్బకి క్షమించమంటున్న డైరెక్టర్

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టు తయారైంది ప్రముఖ డైరెక్టర్ విజయ్‌ కనకమేడల పరిస్థితి. అల్లరి నరేష్ తో తెరకెక్కించిన "నాంది" సినిమాతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ డైరెక్టర్ ఆ తర్వాత ఉగ్రంతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లతో " భైరవం " చిత్రం తెరకెక్కిస్తున్నారు. తమిళంలో హిట్ కొట్టిన 'గరుడన్' సినిమాకు రీమేక్ గా రాబోతుండగా.. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు. మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మూవీ.

బాయ్ కాట్ భైరవం..

అయితే రీసెంట్ గా మే 18వ తేదీన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్.. ఏలూరులో ఘనంగా నిర్వహించారు. ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ధర్మాన్ని కాపాడటం కోసం ఎప్పుడు ఎవరోకరు వస్తూనే ఉంటారు. సరిగ్గా సంవత్సరం క్రితం మన రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఒకరు వచ్చారు. అలాగే మా సినిమాలో కూడా ధర్మాన్ని కాపాడాడానికి మా కాల భైరవులు వచ్చి ధర్మాన్ని కాపాడతారు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

director-vijay-kanakamedala-emotional-post-about-boycott-bhairavam-trolling

దాంతో ఆయన చేసిన కామెంట్స్‌పై వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దాంతో బాయ్‌కాట్‌ భైరవం (#boycott Bhairavam) అనే పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పవసతులు పెడుతున్నారు.

మరోవైపు ఈ బాయ్ కాట్ నినాదానికి మెగా అభిమానులు సైతం అగ్నికి ఆజ్యం తోడైనట్టు జతకలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2011 లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ను ట్రోల్ చేస్తూ పెట్టిన పోస్టులను ఇప్పుడు వైరల్ చేస్తూ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ ఈ ట్రోలింగ్‌పై స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు.

ఆ పోస్టులో ఏం రాశారంటే..

అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ.. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతుంది. దానికి ముందు నుంచి కూడా మెగా అభిమానుల నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నారు. కానీ ఈ రోజు నాకు తెలియకుండా ఒక 30 మినిట్స్ నుంచి మెగా అభిమానుల వైపు నుంచి కూడా ట్రోల్ జరుగుతున్నట్టు తెలిసింది. ఎప్పుడో 2011లో ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టానని ట్రోల్ చేస్తున్నారు. అది నేను పెట్టిన పోస్ట్ కాదు.. ఏదో జరిగింది.. హ్యాక్ అయి ఉంటుందని పోస్ట్ చేశారు.

అలానే.. నేను అందరు హీరోలతో పని చేశాను.. ఎక్కువ పని చేసింది మెగా హీరోలతోనే. మెగా హీరోలు అందరితోనూ నాకు సానిహిత్యం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు నేను పని చేశాను. అప్పుడు నన్ను కళ్యాణ్ బాగా సపోర్ట్ చేశారు. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ ని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు. తేజ్ తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్నా అన్నా అని సంబోధిస్తారు. అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానండి. అందరిలాగే నేను కూడా చిరంజీవి సినిమాలు చూసి, పవర్ స్టార్ సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను డైరెక్టర్ అవుదామని..! అటువంటిది నేనెందుకు వాళ్లను దూరం చేసుకుంటాను.. అలాంటి తప్పు ఎందుకు చేస్తాను..? నా సోషల్ మీడియా పేజీలో పోస్ట్ అయింది.. తెలిసో తెలియకో జరిగింది.. అది హ్యాక్ అయింది.. అయినా కూడా నా సోషల్ మీడియా పేజీ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నాను.

ఇంకొకసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటాను.. ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు.. కాబట్టి ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు.. దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు మెగా అభిమానులు అందరికీ.. మీలో ఒకడిగా నేను హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను అంటూ రాసుకొచ్చారు. కానీ ఏ సుధీర్ఘ పోస్టులో వైసీపీ శ్రేణులను మాత్రం ఎక్కడా మెన్షన్ చేయకపోవడం రాజకీయంగా అగ్గి రాజేస్తూనే ఉంది. చూడాలి మరి మెగా ఫ్యాన్స్ చల్లబడ్డా.. వైసీపీ ఫ్యాన్స్ మాత్రం సైలెంట్ అవుతారో లేదో అని.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+