అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య మాటల్లేవ్..?.. ఈ రెండే సాక్ష్యం!!
మెగా కుటుంబంలో చిరంజీవి కుటుంబానికి, అల్లు అరవింద్ కుటుంబానికి కొన్నాళ్లుగా ఏదో గ్యాప్ నడుస్తోందనే ప్రచారం జరుగుతోంది. అది నిజమనేదానికి కొందరు ఆధారాలు కూడా చూపిస్తున్నారు. అల్లు అర్జున్-రామ్ చరణ్ మధ్య వృత్తిపరంగా ఉన్న పోటీ వ్యక్తిగతంగా మారిపోయిందంటున్నారు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి సందర్భంగా చిరంజీవి తన ఇంట్లో గ్రాండ్ గా పార్టీని ఇచ్చారు.
చిరంజీవి గెట్ టు గెదర్ : కాబోయే భార్యాభర్తల్ని తన ఇంటికి పిలిపించి గెట్ టు గెదర్ ఏర్పాటు చేశారు. చిరంజీవి, అతని సోదరుల కుటుంబాలకు చెందినవారంతా హాజరయ్యారు. అయితే ఇద్దరు మాత్రం హాజరవలేదు. వారు... పవన్ కల్యాణ్, అల్లు అర్జున్. రాజకీయంగా పవన్ బిజీగా ఉన్నాడు కాబట్టి రాకపోయినా ఇబ్బందిలేదుటే అని సర్దిచెప్పుకోవచ్చు. అయితే అల్లు అర్జున్ ఎందుకు హాజరు కాలేదనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది.

అల్లు అర్జున్ రాలేదు : చిరంజీవి పార్టీ ఇచ్చే సమయానికి అల్లు అర్జున్ ఊళ్లోనే ఉన్నాడు. వెసులుబాటు చేసుకొని పార్టీకి వచ్చే తీరిక కూడా ఉంది. అయినా రాలేదు.. వేడుకలో కనిపించలేదు. ఆ తర్వాత బన్నీ-స్నేహారెడ్డి దంపతులు వరుణ్-లావణ్యకు పార్టీ ఇచ్చారు. మెగా కుటుంబానికి చెందినవారందరినీ ఆహ్వానించారు. ఈ వేడుకకు నితిన్, రీతూవర్మ లాంటి సన్నిహితంగా ఉండేవారు కూడా వచ్చారుకానీ రామ్ చరణ్ కనిపించలేదు. దీంతో అనుమానాలు మరింతగా పెరిగాయి.
రామ్ చరణ్ రాలేదు: రామ్ చరణ్-అల్లు అర్జున్ మధ్య ఏమాత్రం పొసగటంలేదని, ఆస్కార్ వచ్చినప్పుడు బన్నీ వేసిన ట్వీట్.. దానికి రిటార్టుగా నేషనల్ అవార్డు వచ్చినప్పుడు చరణ వేసిన ట్వీట్ చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో రగడ ఉందనే చర్చ కొన్నాళ్ల నుంచి సాగుతోంది. తాజాగా జరిగిన ఈ రెండు వేడుకలను పరిశీలించినా ఆ అనుమానాలకు బలం చేకూరుతోంది. రామ్ చరణ్ ఇచ్చిన పార్టీకి అల్లు అర్జున్ రాలేదు.. అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీకి రామ్ చరణ్ రాలేదు. అంతే..












Click it and Unblock the Notifications