హిట్టు సినిమా అన్నారు.. 100 కోట్లు వచ్చాయ్ అన్నారు.. అంతా ఫేక్
ఈ రోజుల్లో ఏ సినిమా హిట్ అవుతుందో , ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో చెప్పడం కష్టం. సినిమాలు హిట్ కావాలంటే సోషల్ మీడియాలో ఉన్న నెగిటివిటీని దాటుకుని బయటపడాల్సి ఉంది. అలా దాటుకుని వచ్చిన సినిమాలు మాత్రమే హిట్‌గా నిలుస్తున్నాయి. ఈ మధ్య సినిమా వాళ్లు కూడా బాగానే తెలివి మీరారు. సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ , మా సినిమా హిట్ అని సెలబ్రేషన్స్ చేసుకోవడం ఫిల్మ్ మేకర్స్‌కు పరిపాటిగా మారింది. తాజాగా ఓ సినిమా విషయంలో సరిగ్గా ఇలానే జరిగింది. సినిమాకు వచ్చిన టాక్‌కు , వాళ్లు ప్రకటించిన కలెక్షన్లకు ఎక్కడా సంబంధం లేదనే ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు ఓ డిస్ట్రిబ్యూటర్ బయటకు వచ్చిన మరీ ఆ సినిమా వల్ల నష్టపోయామని చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆ సినిమా మరేదో కాదు...న్యాచురల్ స్టార్ నాని నటించి, నిర్మించిన "హిట్-3".హిట్ సీక్వెల్‌లో భాగంగా "హిట్-3" తెరకెక్కింది. ఈ సినిమాకు శైలేష్ కొలన్ దర్శకత్వం వహించారు. గతంలో వచ్చిన రెండు పార్టులు సూపర్ హిట్ కావడంతో, "హిట్-3"పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.సినిమా హిట్ అని ఫిల్మ్ మేకర్స్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు.అయితే వాస్తవానికి "హిట్-3" సినిమా కొన్ని చోట్ల నష్టాలను మిగ్చినట్టు తెలుస్తోంది. పెట్టిన పెట్టుబడి కూడా ఈ సినిమా తీసుకురాలేపోయిందని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు.

తాజాగా ఓ డిస్ట్రిబ్యూటర్ ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. "హిట్-3" సినిమా వల్ల తాము రూ.50 లక్షలు నష్టపోయామని తెలిపారు. కానీ ఈ విషయాలు ఎవరికి తెలియదని, ఎవరూ పట్టించుకోరని ఆయన తెలిపారు. నిర్మాతలు సేఫ్ అవుతున్నారని, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారని సదరు డిస్ట్రిబ్యూటర్ ఈ ఇంటర్య్వూ సాక్షిగా చెప్పుకొచ్చారు.దీంతో "హిట్-3" బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి దీనిపై సినిమా హీరో, నిర్మాతైనా నాని ఎలా స్పందిస్తారో చూడాలి.
-
'ఉస్తాద్'కు నో కట్స్.. ఓన్లీ పవర్! సెన్సార్ పూర్తి, రన్‌టైమ్ లాక్ -
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న హీరో -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం












Click it and Unblock the Notifications