నీలో ఈ యాంగిల్ ఉందని అసలు ఊహించలేదు అమ్మడు
బిగ్‌బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి దివి వద్త్య. బిగ్‌బాస్‌కు ముందు 'మహర్షి', 'గాడ్ ఫాదర్' వంటి సినిమాల్లో నటించినా రాని గుర్తింపును, కేవలం ఒక్క రియాలిటీ షోతో దక్కించుకుంది. మంచి హైట్, ఫిజిక్ ఉన్నప్పటికీ, హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు రాకపోవడం దివిని నిరాశపరిచింది.
బిగ్‌బాస్ తర్వాత వచ్చిన పాపులారిటీతో కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లలో నటించినా, అవి అనుకున్నంత గుర్తింపు తీసుకురాలేకపోయాయి. ఇటీవల విడుదలైన 'లంబసింగి' సినిమా కూడా ఆమెకు సరైన బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో, ఓ ఇంటర్వ్యూలో దివి తన మనసులోని బాధలను బయటపెట్టింది. అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని, లావుగా ఉంటే సన్నగా అవ్వాలని, సన్నగా ఉంటే లావు అవ్వాలని రకరకాల కండిషన్లు పెట్టారని తెలిపింది. వాటిని తట్టుకొని తన శరీర ఆకృతిని మార్చుకున్నానని చెప్పింది.

ముఖ్యంగా, రవితేజ సినిమాకు లీడ్ క్యారెక్టర్‌గా తనను ఎంపిక చేసి, 'నీ హైట్, ఫిజిక్ సినిమాకు ఎసెట్' అని చెప్పి, చివరికి అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేవారని దివి బాధపడింది. ఈ బాధలను భరించలేక ఎన్నోసార్లు ఇంటికెళ్లి షవర్ కింద నిలబడి నోరు మూసుకొని ఏడ్చానని చెప్పింది. రవితేజ సినిమాలో ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి తనను తొలగించారని వెల్లడించింది.
ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, దివి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా విశేషాలను, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. దివిని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది. తాజాగా, ఆమె షేర్ చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది.ఎప్పుడు హాట్ హాట్‌గా కనిపించే దివి, మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది. పింక్ కలర్ ఫ్రాక్‌తో దర్శనం ఇచ్చింది. తన అందంతో అభిమానులకు కనువిందు చేసింది. ఈ ఫొటోల్లో హాట్ హాట్‌గా ఇచ్చిన ఫోజులు హైలెట్ అయ్యాయి. ఆకర్షణీయమైన ఫొజులతో కుర్రకారు మతులు పోగొడుతోంది. దివి అందాల ఫొజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.












Click it and Unblock the Notifications