నడుము ఎక్కడ చేయించిందిరా బాబు ..ఇంత అందంగా ఉంది

రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది నటి దివి వద్త్య. 'మహర్షి', 'గాడ్ ఫాదర్' వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించినా దక్కని గుర్తింపును, బిగ్‌బాస్ షో ఒక్కటే ఆమెకు తెచ్చిపెట్టింది. మంచి హైట్, ఆకర్షణీయమైన ఫిజిక్ ఉన్నా, హీరోయిన్‌గా మాత్రం సరైన బ్రేక్ రాక దివి నిరాశలో ఉంది.

బిగ్‌బాస్ తర్వాత వచ్చిన పాపులారిటీతో కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లు చేసినా.. అవి ఆమె కెరీర్‌కు అనుకున్నంత మైలేజ్ ఇవ్వలేకపోయాయి. ఇటీవల విడుదలైన 'లంబసింగి' సినిమా కూడా దివికి పెద్ద బ్రేక్ ఇవ్వడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దివి తన మనసులోని బాధను, సినీ పరిశ్రమలోని కఠిన పరిస్థితులను బయటపెట్టింది.

Divi Vadthya Sets Social Media Ablaze with Latest Photoshoot

అవకాశాల కోసం ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగానని, డైరెక్టర్లు, నిర్మాతలు రకరకాల కండీషన్లు పెట్టేవారని తెలిపింది. లావుగా ఉంటే సన్నగా అవ్వాలి, సన్నగా ఉంటే లావు అవ్వాలి అని చెప్పేవారు. వారి కోరిక మేరకు నా శరీర ఆకృతిని మార్చుకోవడానికి చాలా కష్టపడ్డానని దివి ఎమోషనల్ అయ్యింది.

కెరీర్ విషయంలో ఇలాంటి నిరాశ ఉన్నప్పటికీ, దివి సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీపావళి సందర్భంగా చేసిన ఫొటోషూట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అమ్మడు. ఎప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టే దివి ఈసారి పద్దతిగా కనిపించి అభిమానులకు షాకిచ్చింది.

ఈ ఫొటోలలో దివి తన ఆకర్షణీయమైన నడుము అందాలు హైలెట్ అయ్యేలా ఇచ్చిన ఫోజులు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. దివి పర్ఫెక్ట్ ఫిగర్‌తో కూడిన ఈ ఆకర్షణీయమైన ఫొటోలపై నెటిజన్లు తమ ప్రేమను కురిపిస్తున్నారు.ప్రస్తుతం దివి టాటూ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. గ్లామర్ డోస్ పెంచి, అవకాశాల వేటలో మరింత దూకుడు పెంచిన దివికి సరైన బ్రేక్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+